Jawan : జవాన్ నుంచి ‘రామయ్యా వస్తావయ్యా’ సాంగ్ రిలీజ్.. షారుఖ్ డాన్స్ అదుర్స్..

షారుఖ్ నటిస్తున్న జవాన్ చిత్రం నుంచి మరో సాంగ్ రిలీజ్ అయ్యింది. పాటలో షారుఖ్ వేసిన సింపుల్ స్టెప్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి.

Jawan : జవాన్ నుంచి ‘రామయ్యా వస్తావయ్యా’ సాంగ్ రిలీజ్.. షారుఖ్ డాన్స్ అదుర్స్..

Not Ramaiya Vastavaiya song release from Shah Rukh Khan Jawan

Jawan : షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) హీరోగా తమిళ్ దర్శకుడు అట్లీ డైరెక్ట్ చేస్తున్న సినిమా ‘జవాన్’. షారుఖ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్న ఈ మూవీలో నయనతార (Nayanathara) హీరోయిన్ గా, విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నారు. సినిమాకి సంబంధించిన పనులు అన్ని పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో సందడి చేస్తుంది. ఈక్రమంలోనే వరుసపెట్టి ఒక్కో సాంగ్ ని రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. అనిరుద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.

South Stars : 600 కోట్లు క్లబ్‌లోకి అడుగుపెట్టిన సౌత్ స్టార్స్ వీరే.. ఏ హీరోకి ఎన్ని సినిమాలు..?

ఇప్పటికే రెండు సాంగ్స్ ని రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మూడో సాంగ్ ని రిలీజ్ చేశారు. ‘రామయ్యా వస్తావయ్యా’ అంటూ సాగే ఈ పాటకి తెలుగు లిరిక్స్ చంద్రబోస్ అందించగా అనిరుద్, శ్రీరామ చంద్ర, రక్షిత సురేష్ పాడారు. వైభవి మర్చంట్ ఈ సాంగ్ కి డాన్స్ కోరియోగ్రఫీ చేశారు. పాటలో షారుఖ్ వేసిన సింపుల్ స్టెప్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి. ఇక సాంగ్ వినడానికి, విజువల్ గా బాగుంది. మరి ఆ సాంగ్ ని ఒకసారి మీరుకూడా చూసేయండి.

Sankranti 2024 : ఈసారి పండక్కి సినిమాల జాతర మాములుగా లేదుగా..

కాగా ఈ మూవీ నుంచి ఇప్పటికే ప్రివ్యూ అంటూ ఒక ట్రైలర్ కట్ ని రిలీజ్ చేశారు. తాజాగా ఇప్పుడు మరో ట్రైలర్ ని రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. రాఖి సందర్భంగా ఆగష్టు 31న ఈ ట్రైలర్ ని రిలీజ్ చేయనున్నారని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ప్రియమణి, సన్య, యోగిబాబు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే అతిధి పాత్రలో మెరవబోతుంది. అలాగే తమిళ్ స్టార్ హీరో విజయ్ (Vijay) కూడా అతిధి పాత్రలో కనిపించబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 7న హిందీ, తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.