NTR – Rajamouli : తారక్, జక్కన్న ముఖ్య అతిథులుగా ‘తెల్లవారితే గురువారం’..

ఫస్ట్ మూవీ ‘మత్తు వదలరా’ తో గుర్తింపు తెచ్చుకున్న సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్. కీరవాణి రెండో కుమారుడు శ్రీ సింహా కోడూరి హీరోగా నటిస్తున్న సినిమా ‘తెల్లవారితే గురువారం’.. మణికాంత్ దర్శకత్వంలో వారాహి చలనచిత్రం, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మిషా నారంగ్, చిత్రా శుక్లా కథానాయికలుగా నటిస్తున్నారు.

NTR – Rajamouli : తారక్, జక్కన్న ముఖ్య అతిథులుగా ‘తెల్లవారితే గురువారం’..

Ntr – Rajamouli

Updated On : March 17, 2021 / 5:32 PM IST

NTR – Rajamouli: ఫస్ట్ మూవీ ‘మత్తు వదలరా’ తో గుర్తింపు తెచ్చుకున్న సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్. కీరవాణి రెండో కుమారుడు శ్రీ సింహా కోడూరి హీరోగా నటిస్తున్న సినిమా ‘తెల్లవారితే గురువారం’.. మణికాంత్ దర్శకత్వంలో వారాహి చలనచిత్రం, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మిషా నారంగ్, చిత్రా శుక్లా కథానాయికలుగా నటిస్తున్నారు.

Thellavarithe Guruvaram

ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోస్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.. ఇటీవల ‘మనసుకి హానికరం అమ్మాయే’ అనే లిరికల్ సాంగ్ వదలగా యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Thellavarithe Guruvaram

తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముహూర్తం ఫిక్స్ చేశారు. మార్చి 21 సాయంత్రం 6 గంటలనుండి హైదరాబాద్ జేఆర్‌సీ కన్వెన్షన్‌లో ‘తెల్లవారితే గురువారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ప్లాన్ చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు రాజమౌళి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరవబోతున్నారు. మార్చి 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read>>>  ‘మనసుకి హానికరం అమ్మాయే’..