Narne Nithin : గీతా ఆర్ట్స్ నిర్మాణంలో ఎన్టీఆర్ బామ్మర్ది హీరోగా సినిమా..

నార్నె నితిన్ కొత్త సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు విచ్ఛేసారు. హీరో, హీరోయిన్స్ పై అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, దిల్ రాజు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. పల్లెటూరు లవ్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కబోతుంది సమాచారం.

Narne Nithin : గీతా ఆర్ట్స్ నిర్మాణంలో ఎన్టీఆర్ బామ్మర్ది హీరోగా సినిమా..

NTR Brother in Law Narne Nithin New Movie opening under GA2 Pictures

Updated On : July 13, 2023 / 12:43 PM IST

Narne Nithin New Movie :  ఎన్టీఆర్ బామ్మర్ది, ప్రణతి సోదరుడు నార్నె నితిన్ హీరోగా సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో తెరకెక్కించడం విశేషం. బన్నీ వాసు, విద్య కొప్పినీడి నిర్మాణంలో అంజిబాబు కంచిపల్లి దర్శకత్వంలో నార్నె నితిన్ హీరోగా, నయన్ సారిక హీరోయిన్ గా సినిమాని నేడు ప్రకటించారు. నేడు ఈ సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి.

నార్నె నితిన్ కొత్త సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు విచ్ఛేసారు. హీరో, హీరోయిన్స్ పై అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, దిల్ రాజు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. పల్లెటూరు లవ్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కబోతుంది సమాచారం.

Roshan : పాన్ ఇండియా సినిమాలో శ్రీకాంత్ కొడుకు.. మోహన్ లాల్‌కి తనయుడిగా రోషన్..

గతంలో నార్నె నితిన్ హీరోగా శ్రీ శ్రీ శ్రీ రాజావారు అనే సినిమాని కూడా ప్రకటించారు. అది ఇంకా రిలీజ్ అవ్వకముందే రెండో సినిమాని కూడా తెరకెక్కిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వనుంది.