Devara Second Single : ‘దేవ‌ర’ నుంచి రొమాంటిక్ మెలోడి వ‌చ్చేసింది.. ఎన్టీఆర్, జాన్వీ కెమిస్ట్రీ అదుర్స్‌..

ఎన్టీఆర్ న‌టిస్తున్న చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

Devara Second Single : ‘దేవ‌ర’ నుంచి రొమాంటిక్ మెలోడి వ‌చ్చేసింది.. ఎన్టీఆర్, జాన్వీ కెమిస్ట్రీ అదుర్స్‌..

Devara Second Single released

Devara Second Single – NTR : ఎన్టీఆర్ న‌టిస్తున్న చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. రెండు భాగాలుగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. తొలి భాగానికి సంబంధించిన షూటింగ్ పూర్తైంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఇక మొద‌టి పార్టు సెప్టెంబ‌ర్ 27న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను మొద‌లుపెట్టింది.

ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి ఓ మాస్ గ్లింప్స్‌తో పాటు ఓ పాట‌ను విడుద‌ల చేయ‌గా తాజాగా రెండో పాట‌ను విడుద‌ల చేశారు. ‘చుట్టమల్లె చుట్టేస్తాంది తుంటరి చూపు.. ఊరికే ఉండ‌దు కాసేపు.. అస్త‌మానం నీ లోక‌మే నా మైమ‌ర‌పు.. చేత‌నైతే నువ్వే న‌న్ను ఆపు’ అంటూ ఈ పాట సాగుతోంది.

Pushpa 2 : ‘పుష్ప-2’ నుంచి సాలీడ్ అప్‌డేట్‌.. క్లైమాక్స్ గూస్‌బంప్స్‌..

ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాయగా అనిరుద్ సంగీతం అందించాడు. ఈ రొమాంటిక్ మెలోడీ చాలా బాగుంది. ప్ర‌స్తుతం ఇది సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.