Devara : రేపే ‘దేవర’ రిలీజ్.. హిట్ అవ్వాలంటే ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేయాలి.. దేవర ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ..
ప్రపంచవ్యాప్తంగా దేవర థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు..

NTR Devara Theatrical Pre Release Business Details Here
Devara Pre Release Business : ఎన్టీఆర్ దేవర సినిమా రేపు సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతుంది. సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దేవర సినిమాకు బిజినెస్ కూడా బాగానే జరిగింది. ఇప్పటికే థియేట్రికల్ తో పాటు ఓటీటీ రైట్స్ కూడా అమ్ముడుపోయినట్టు సమాచారం.
ప్రపంచవ్యాప్తంగా దేవర థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు..
దేవర సినిమా నైజాంలో 45 కోట్లకు
ఆంధ్రలో 46 కోట్లకు
సీడెడ్ లో 22 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడు పోయాయి.
కర్ణాటకలో 15 కోట్లు
కేరళ 50 లక్షలు
తమిళనాడు 6 కోట్లు
నార్త్ మొత్తం 20 కోట్లు
ఓవర్సీస్ 26 కోట్లకు అమ్ముడయ్యాయి.
మొత్తంగా దాదాపు 180 కోట్ల వరకు దేవర ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
దీంతో దేవర సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 360 కోట్లకు పైగా కలెక్ట్ చేయాలి. ఇక హిట్ అవ్వాలంటే కనీసం 400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయాలి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 230 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే దేవర హిట్ అయినట్టు అని సమాచారం. దీంతో ఎన్టీఆర్ కి ప్రపంచవ్యాప్తంగా భారీ టార్గెట్ ఏర్పడింది.
సోలో హీరోగా ఎన్టీఆర్ కి మొదటిసారి ఇంత భారీ బిజినెస్ జరగడం, ఇంత పెద్ద టార్గెట్ రావడం. మూవీ యూనిట్ అయితే 500 కోట్ల గ్రాస్ టార్గెట్ పెట్టుకొని బరిలోకి దిగుతుంది. మరి ఏ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయో చూడాలి.