NTR : న్యూయార్క్ రెస్టారెంట్‌ కిచెన్‌లో ఎన్టీఆర్..

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. కుటుంబంతో సహా ఇటీవల అమెరికా వెళ్లిన ఎన్టీఆర్.. అక్కడ ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నాడు. కాగా జూనియర్ ఎన్టీఆర్ కి కుకింగ్ అంటే ఇష్టమని అందరికి తెలుసు. అమెరికాలోని ఒక రెస్టారెంట్ కి వెళ్లిన ఎన్టీఆర్..

NTR : న్యూయార్క్ రెస్టారెంట్‌ కిచెన్‌లో ఎన్టీఆర్..

NTR in the kitchen of a New York restaurant

Updated On : December 26, 2022 / 1:04 PM IST

NTR : టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ బ్లాక్‌బస్టర్ హిట్టని అందుకొని పాన్ ఇండియా మార్కెట్ తో పాటు గ్లోబల్ స్థాయిలో కూడా అభిమానులను సంపాదించుకున్నాడు తారక్. దీంతో ఈ హీరో తదుపరి సినిమా కోసం వరల్డ్ వైడ్‌గా ఉన్న అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే RRR కోసం దాదాపు 4 ఏళ్ళ మూవీకే కేటాయించిన ఎన్టీఆర్.. ఇప్పుడు మరో ప్రాజెక్ట్ కి వెళ్లే ముందు కుటుంబానికి కొంత సమయం కేటాయించాలనే నిర్ణయం తీసుకొన్నాడు.

NTR : చలపతిని కడసారి చూసేందుకు వీడియో కాల్ చేసిన ఎన్టీఆర్..

దీంతో కుటుంబంతో సహా ఇటీవల అమెరికా వెళ్లిన ఎన్టీఆర్.. అక్కడ ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నాడు. కాగా జూనియర్ ఎన్టీఆర్ కి కుకింగ్ అంటే ఇష్టమని అందరికి తెలుసు. అమెరికాలోని ఒక రెస్టారెంట్ కి వెళ్లిన ఎన్టీఆర్.. ఆ రెస్టారెంట్ కిచెన్‌లో చెఫ్‌లతో దిగిన ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. అమెరికాలో బెస్ట్ ఇండియన్ ఫుడ్ తినాలి అంటే జునూన్‌ రెస్టారెంట్‌కి వెళ్ళండి అంటూ రాసుకొచ్చాడు.

ఇక ఎన్టీఆర్ సినిమా విషయానికి వస్తే.. ఎన్టీఆర్, కొరటాల సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరిలో మొదలుకానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. ఈ మూవీలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయి అంటా, అందుకోసం ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ హైదరాబాద్ శివారులో భారీ సెట్ ని వేయిస్తున్నట్లు సమాచారం.