kantara 2: కాంతార 2 ఈవెంట్ కి గెస్ట్ గా ఎన్టీఆర్.. క్లారిటీ ఇచ్చేసిన టీమ్

కాంతార.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా క్రియేట్ చేసిన (kantara 2)సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ సినిమా.

kantara 2: కాంతార 2 ఈవెంట్ కి గెస్ట్ గా ఎన్టీఆర్.. క్లారిటీ ఇచ్చేసిన టీమ్

NTR is the chief guest for Kantara 2 pre-release event

Updated On : September 26, 2025 / 7:30 PM IST

kantara 2: కాంతార.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా క్రియేట్ చేసిన సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ సినిమా. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా చేసిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. డివోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా మేకర్స్ కేవలం రూ.16 కోట్లు ఖర్చు చేశారు. కానీ, లాంగ్ రన్ లో ఈ సినిమా రూ.350 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్ గా కాంతార 2: ది లెజెండ్ సినిమా వస్తోంది. భారీ అంచనాల(kantara 2) మధ్య ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Rishab Shetty: జీవితాంతం గుర్తుండిపోయే సన్నివేశం.. షూట్ టైంలో కఠిన నియమాలు: రిషబ్ శెట్టి

ప్రమోషన్స్ లో భాగంగా సెప్టెంబర్ 28న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు మేకర్స్. హైదరాబాద్ JRC కన్వేషన్ లో జరుగునున్న ఈ ఈవెంట్ కు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గెస్ట్ గా రానున్నాడట. ఈ విషయాన్ని కాంతార మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక రిషబ్ శెట్టి, ఎన్టీఆర్ ఎంత మంచి స్నేహితులు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సాన్నిహిత్యం వల్లనే ఇప్పుడు కాంతార 2 ఈవెంట్ కి రావడానికి ఎన్టీఆర్ ఒప్పుకున్నాడట. ఇక ఈ ఈవెంట్ తరువాత కాంతార 2 హైప్ నెక్స్ట్ లెవల్ కు చేరనుంది.

ఇక ఎన్టీఆర్ కి ఇటీవల చిన్న ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లో జరిగిన ఒక యాడ్ షూట్ లో భాగంగా ఆయన ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన రెస్ట్ లో ఉన్నట్టుగా ఎన్టీఆర్ టీం ప్రకటించారు. అయితే, ఈ ప్రమాదం తరువాత మొదటిసారి మీడియా ముందుకు రానున్నారు ఎన్టీఆర్. దాంతో, ఈ ఈవెంట్ పై భారీ హైప్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే, ఎన్టీఆర్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఈ ఈవెంట్ కి వచ్చే అవకాశం ఉంది.

NTR is the chief guest for Kantara 2 pre-release event