MAA Elections : ‘మా’ లో అలజడి తప్ప అభివృద్ధి లేదు – ఒ.కళ్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్..

‘మా’ ఎన్నికల వివాదం గురించి నటుడు ఒ.కళ్యాణ్ ప్రెస్‌మీట్‌లో సెన్సేషనల్ కామెంట్స్ చేశారు..

MAA Elections : ‘మా’ లో అలజడి తప్ప అభివృద్ధి లేదు – ఒ.కళ్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్..

O Kalyan Press Meet About Maa Elections 2021

Updated On : June 29, 2021 / 4:43 PM IST

MAA Elections: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. అధ్యక్ష బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, హేమ, జీవిత రాజశేఖర్ పోటీ పడుతుండగా మరో నటుడు ఒ.కళ్యాణ్ కూడా పోటీ చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఫిలింనగర్ కల్చరల్ క్లబ్‌లో ఒ.కళ్యాణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

మా ఎన్నికల వివాదంపై ఓ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘‘మా’ అసోసియేషన్ అంపశయ్యపై ఉంది. 15 ఏళ్ల నుంచి ‘మా’ లో అలజడి తప్ప అభివృద్ధి లేదు. ‘మా’ ఎన్నికలు వచ్చాయంటే యుద్ధ వాతావరణం ఉంటుంది. ‘మా’ ఎన్నికలు పంచాయతీ ఎన్నికల కంటే దారుణంగా తయారయ్యాయి. ‘మా’ అసోసియేషన్ సర్వీస్ ఓరియంట్‌గా లేదు. 25 ఏళ్లుగా ‘మా’ అసోసియేషన్ ఎందుకు భవనాన్ని నిర్మించడం లేదు. పద్మాలయా స్టూడియో వెనుక 1000 గజాల స్థలం అప్పటి ప్రభుత్వం ఇస్తే నిర్లక్ష్యం చేశారు.

ఇప్పుడున్న సినీ పెద్దలకు ‘మా’ అసోసియేషన్‌కు 1000 గజాల స్థలం కొనుగోలు చేసే శక్తి లేదా?.. ‘మా’ అసోసియేషన్ ఎన్నికల ప్రకటన రాకుండానే ప్రకాష్ రాజ్ ఎందుకు ముందుకు వచ్చారు?.. ప్రశ్నించేవాళ్లు తన చుట్టూ ఉన్నారన్న ప్రకాష్ రాజ్.. వాళ్లు ఎంత మందిని ప్రశ్నించారు?.. ‘మా’ ఎన్నికల్లో నేను ఆరుసార్లు పోటీ చేసి ఓడిపోయాను. మద్దతిస్తూ గెలిపించిన వాళ్లు ఎన్నికలు పూర్తవగానే తప్పుకుంటున్నారు. ‘మా’ అసోసియేషన్ అల్లరి కాకుండా సినీ పెద్దలు కాపాడండి. నేను ఏ పదవికి పోటి చేయడం లేదు, ఎవరికి మద్దతు ఇవ్వడం లేదు. ‘మా’ ఎన్నికలు జరగకుండా పెద్దలు ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి. ‘మా’ అసోసియేషన్ భవనానికి నా ఆస్తులమ్మి రూ.1.50 కోట్లు నేను ఇస్తాను. ‘మా’ అసోసియేషన్‌ను కోమా నుంచి బయటపడేయాలి’’ అన్నారు..