Om Shanthi Disco Shanthi : ‘ఓం శాంతి డిస్కో శాంతి’ అంటున్న ‘యాత్ర’ దర్శకుడు..
ఇప్పటి వరకు దెయ్యాలు మనుషుల్ని భయపెట్టాయి. కానీ ఆ దెయ్యాలకే భయం పుట్టించే వాళ్లు ఎదురైతే.. (Om Shanthi Disco Shanthi)
Om Shanthi Disco Shanthi
Om Shanthi Disco Shanthi : యాత్ర, ఆనందో బ్రహ్మ, సేవ్ ది టైగర్స్.. లాంటి సూపర్ హిట్ సినిమాలు, సిరీస్ లని తెరకెక్కించిన దర్శక నిర్మాత మహి వి.రాఘవ్ ఇప్పుడు రచయితగా, షో రన్నర్ గా మరో సినిమాతో రాబోతున్నాడు. ‘ఓం శాంతి డిస్కో శాంతి’ అనే కామెడీ హారర్ సినిమాతో రాబోతున్నాడు. ‘ఆల్ రెడీ కాషన్ కియా.. ఆల్ రెడీ’ అనే సరదా క్యాప్షన్ తో నేడు ఈ సినిమా మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసారు.
ఇప్పటి వరకు దెయ్యాలు మనుషుల్ని భయపెట్టాయి. కానీ ఆ దెయ్యాలకే భయం పుట్టించే వాళ్లు ఎదురైతే, అసలు భయం అంటే తెలియని పిచ్చివాళ్లు ఈ దెయ్యాల ముందుకు వస్తే, దెయ్యాలు వర్సెస్ పిచ్చివాళ్లు మధ్య జరిగే ఓ గందరగోళమైన ఫుల్ ఫన్ రైడర్ తో ఊహించని సరికొత్త ట్విస్ట్‌తో ఈ ‘ఓం శాంతి డిస్కో శాంతి’ సినిమా తెరకెక్కుతుంది.
Also Read : Bharathiraja : ఒకప్పటి స్టార్ డైరెక్టర్.. పాపం.. ఇప్పుడు ఇలా వీల్ చైర్ లో.. గుర్తుపట్టలేనంతగా మారిపోయి..
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి నేడు మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి సెప్టెంబర్ 4న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ సినిమాని త్రీ ఆటమ్ లీవ్స్ బ్యానర్ పై శివ మేక, సాహితి చింతలపూడి నిర్మాణంలో మహి వి.రాఘవ్ రచనతో గోగు ఆర్.ఆర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
