Bharathiraja : ఒకప్పటి స్టార్ డైరెక్టర్.. పాపం.. ఇప్పుడు ఇలా వీల్ చైర్ లో.. గుర్తుపట్టలేనంతగా మారిపోయి..
80, 90వ దశకంలో తమిళ సినీ పరిశ్రమ రూపు రేఖల్ని తన సినిమాలతో మార్చేశారు భారతీ రాజా. (Bharathiraja)
Bharathiraja
Bharathiraja : ఒకప్పటి స్టార్స్ అంతా ఇప్పుడు వయోభారంతో సినిమాల నుంచి పక్కకు తప్పుకొని శేష జీవితం గడుపుతున్నారు. పలువురు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తాజాగా తమిళ్ స్టార్ డైరెక్టర్ భారతీ రాజా లేటెస్ట్ వీడియో వైరల్ అవ్వడంతో ఆయన్ని చూసి అంతా షాక్ అవుతున్నారు.
16 ఏళ్ళ వయసు, ఎర్ర గులాబీలు, సీతాకోక చిలుక, ఈ తరం ఇల్లాలు, యవ్వనం పిలిచింది, ఆరాధన, జమదగ్ని.. లాంటి ఎన్నో తెలుగు, తమిళ్, హిందీ సూపర్ హిట్ సినిమాలని డైరెక్ట్ చేసారు భారతీరాజా. 80, 90వ దశకంలో తమిళ సినీ పరిశ్రమ రూపు రేఖల్ని తన సినిమాలతో మార్చేశారు భారతీ రాజా. దర్శకుడిగానే కాక నటుడిగా కూడా చాలా సినిమాల్లో నటించి మెప్పించారు.
Also Read : Chiranjeevi : ఇది కదా మెగాస్టార్ అంటే.. సైలెంట్ గా మెగా సాయం.. రెండు కుటుంబాల్లో వెలుగులు..
చివరగా తెలుగులో సర్ సినిమాలో నటించారు. చివరిసారి మలయాళంలో తుడురం సినిమాలో 2025లో నటించారు. అప్పుడు కూడా ఆయన కొంత ఆరోగ్య సమస్యలతో బాధపడుతూనే నటించారు. ఇటీవల కొంత కాలం క్రితం ఆయన కుమారుడు మనోజ్ భారతీ రాజా గుండెపోటుతో మరణించారు. అప్పట్నుంచి ఆయన మానసికంగా కుంగిపోయి మరింత ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఆరోగ్యం క్షీణించి వీల్ చైర్ కే పరిమితమయ్యారు.
తాజాగా సీనియర్ నటి రాధికా శరత్ కుమార్.. భారతి రాజాని కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నాను. ఆయన నా గురువు, ఆయన్ని ఇలా చూడలేకపోతున్నాను అంటూ ఓ వీడియో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో భారతీ రాజా గుర్తుపట్టలేనంతగా మారిపోయి ఉన్నారు. వీల్ చైర్ లోనే కూర్చొని ఉన్నారు. దీంతో అలాంటి స్టార్ డైరెక్టర్, నటుడిని ఈ పరిస్థితిలో చూసి ఫ్యాన్స్, సినిమా లవర్స్ బాధపడుతున్నారు.
Also Read : Mohan Babu : బాబోయ్.. మోహన్ బాబునే భయపెడుతున్న మనవడు.. వీడియో వైరల్..
