Akshay Kumar : ఎట్టకేలకు భారతీయ పౌరసత్వం అందుకున్న అక్షయ్.. మరి ఇన్నాళ్లు ఏ దేశపౌరుడిగా..?

పౌరసత్వం విషయంలో అనేక ఇమర్శలు ఎదురుకుంటున్న బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఎట్టకేలకు భారతీయ పౌరసత్వం అందుకున్నాడు. మరి ఇన్నాళ్లు ఏ దేశపౌరుడిగా ఉన్నాడు..?

Akshay Kumar : ఎట్టకేలకు భారతీయ పౌరసత్వం అందుకున్న అక్షయ్.. మరి ఇన్నాళ్లు ఏ దేశపౌరుడిగా..?

OMG2 Hero Akshay Kumar finally got Indian Citizenship

Akshay Kumar : బాలీవుడ్ హీరో అక్షయ్‌ కుమార్‌ ఎట్టకేలకు భారతీయ పౌరసత్వం అందుకున్నాడు. ఈ పౌరసత్వం విషయంలో అక్షయ్ అనేక ఇమర్శలు ఎదురుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఆ విమర్శలు అన్నిటికి చెక్ పడినట్లు అయ్యింది. నేడు ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నాడు తాను భారతీయ పౌరసత్వం (Indian Citizenship) అందుకున్నట్లు ట్విటర్‌ వేదికగా వెల్లడించాడు. “నా హృదయం, పౌరసత్వం.. రెండూ హిందుస్తానినే” అంటూ పౌరసత్వంకి సంబంధించిన డాక్యుమెంట్ ఫోటోని షేర్ చేశాడు.

Hyper Aadi : ప్రియురాలిని పరిచయం చేసిన హైపర్ ఆది.. ఆమెతోనే నిజమైన ప్రేమ..

అదేంటి భారతీయ సినిమాల్లో నటిస్తూ, భారతదేశంలో ఉంటూ, ఇక్కడ పలు రాజకీయ కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అక్షయ్ కి భారతీయ పౌరసత్వం లేకపోవడం ఏంటని అందరూ ఆలోచిస్తున్నారు. 1990ల్లో అక్షయ్ కి కెరీర్ పరంగా చాలా గడ్డు కాలం ఎదురైంది. ఒకటి రెండూ కాదు ఏకంగా తాను నటించిన 15 సినిమాలు ప్లాప్ అయ్యాయి. దీంతో స్నేహితుడి సలహా మేరకు సినిమాలు మానేసి కెనడా వెళ్లి ఉద్యోగం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈక్రమంలోనే ఆ సమయంలో కెనడా పౌరసత్వం కోసం అప్లై చేసుకున్నాడు.

Salaar – The Vaccine War : మళ్ళీ వార్ ఫిక్స్.. ‘సలార్’ వర్సెస్ ‘ది వ్యాక్సిన్ వార్’.. ప్రభాస్ వర్సెస్ వివేక్ రంజన్..

కెనడా పౌరసత్వం అందుకున్న అక్షయ్ అక్కడికి వెళ్ళడానికి సిద్దమవుతున్న సమయంలో ఇక్కడ తాను నటించిన రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ గా నిలిచాయి. దీంతో కెనడా వెళ్లే ఆలోచన మానుకొని ఇక్కడే సినిమాలు చేస్తూ ఉండిపోయాడు. ఆ తరువాత భారత్‌ పౌరసత్వాన్ని తిరిగి పొందేందుకు ఇండియన్ గవర్నమెంట్ కి దరఖాస్తు చేసుకున్నట్లు కూడా అక్షయ్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. తాజాగా ఇప్పుడు అక్షయ్ తన భారతీయ పౌరసత్వాన్ని అందుకున్నాడు. కాగా 2019 ఎన్నికలకు ముందు అక్షయ్ ప్రధాని నరేంద్ర మోదీని ఇంటర్వ్యూ చేసిన టైంలో పౌరసత్వం పై తీవ్ర విమర్శలు ఎదురుకున్న విషయం తెలిసిందే.