Samantha : ఘనంగా నాగచైతన్య పెళ్లి.. సమంత ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్.. ఫైట్ లైక్ ఏ..
నాగ చైతన్య రెండో వివాహం చేసుకోవడంతో ప్రస్తుతం అందరిదృష్టి.. ఆయన మాజీ భార్య, నటి సమంత పై పడింది.

On Naga Chaitanya Wedding Day Samantha Shares A Cryptic PostOn Naga Chaitanya Wedding Day Samantha Shares A Cryptic Post
టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య, నటి శోభిత దూళి పాళ్ల వివాహం బుధవారం ఎంతో ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు ఈ పెళ్లి వేడుకకు హాజరు అయ్యారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొత్త జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
నాగ చైతన్య రెండో వివాహం చేసుకోవడంతో ప్రస్తుతం అందరిదృష్టి.. ఆయన మాజీ భార్య, నటి సమంత పై పడింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె ఏం పోస్ట్ చేస్తుందా అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తుందా? ఇంకేదైనా పోస్ట్ చేస్తుందా ? అని ఎదురుచూశారు. ఈ క్రమంలో సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.
Rana Daggubati : నాగచైతన్య పెళ్లిలో రానా దగ్గుబాటి సందడి.. స్పెషల్ ఫోటో షేర్ చేసిన రానా..
ఫైట్ లైక్ ఏ గర్ల్ అనే ట్యాగ్‌తో ఓ వీడియోను ఆమె ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఓ అమ్మాయి, అబ్బాయి కుస్తీ పోటీలో పాల్గొంటారు. పోటీ ప్రారంభానికి ముందు అబ్బాయి పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతాడు. అయితే.. అమ్మాయి పట్టుదల ముందు అతడు ఓడిపోతాడు.
Allu Ayaan : ‘ప్రౌడెస్ట్ సన్ బుజ్జి బాబు’.. బన్నీకి అయాన్ ఎమోషనల్ లెటర్.. ఎంత చక్కగా రాశాడో చూడండి..
ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.