Samantha : కొండా సురేఖ వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన సమంత..
తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నటి సమంత మరోసారి స్పందించింది.

Once Again Samantha key comments on Konda Surekha
Samantha : తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నటి సమంత మరోసారి స్పందించింది. తన వెబ్ సిరీస్ సిటాడెట్ ప్రమోషన్స్‌లో భాగంగా సమంత వరుస ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఓ ఇంటర్వ్యూలో యాంకర్ ఇటీవల చర్చనీయాంశమైన కొండా సురేఖ వ్యాఖ్యలపై ప్రశ్నించారు.
సౌత్ ఇండస్ట్రీ అండగా నిలిచి తనకు ధైర్యాన్ని ఇచ్చిందని సమంత చెప్పింది. ఇండస్ట్రీ, ప్రజలు చూపించిన ప్రేమే ఈ వివాదం నుంచి బయటకు వచ్చేలా చేసిందన్నారు. లేకుంటే మరింతగా కుంగిపోయేదాన్ని అని అంది. అందరి సపోర్ట్ వల్లే తిరిగి మీ ముందు కూర్చున్నానంది.
Pushpa 2 : పుష్ప రాజ్ కౌంట్‌డౌన్ స్టార్ట్.. అదిరిపోయిన పోస్టర్..
‘ఇక్కడ ఈ రోజు కూర్చోవడానికి ఎంతో మంది మద్దతు కారణం. దక్షిణాది చిత్ర పరిశ్రమలోని ఎంతో మంది నటీనటులు మద్దతుగా నిలిచారు. వారందరికి నాపై ఉన్ననమ్మకమే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. వారు నాలో ఎంతో ధైర్యాన్ని నింపారు. కష్టాలను ఎదుర్కొనడంలో వారి మద్దతు ఎంతో సాయపడింది. ఒకవేళ వారు నా పక్షాన లేకపోతే మరింతగా కుంగిపోయేదాన్ని. కోలుకునేందుకు చాలా సమయం పట్టేది. నా చుట్టూ ఉన్నవారి మద్దతు వల్లే సమస్యలను ఎదుర్కొగలిగాను. ఇప్పుడు ఇక్కడ కూర్చొగలిగాను.’ అని సమంత అంది.
వరుణ్ ధావన్, సమంతలు ప్రధాన పాత్రల్లో నటించిన సిటాడెట్ హనీ బన్ని నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.
Pradeep Machiraju : మొత్తానికి బయటకి వచ్చిన ప్రదీప్.. పవన్ కళ్యాణ్ టైటిల్ తో..