Tollywood Director : ఒకప్పుడు నటుడిగా ఆ సినిమాలకు ఆడిషన్స్ ఇచ్చి.. ఇప్పుడు డైరెక్టర్ గా వరుస హిట్స్..
నటుడు అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన ఓ వ్యక్తి హీరోగా, నటుడిగా సినిమాలు చేసి, ఆడిషన్స్ ఇచ్చి ఇప్పుడు డైరెక్టర్ గా సినిమాలు చేస్తూ హిట్లు కొడుతున్నాడు.

Once upon a time an Actor now Turned as Director and getting Hits with Star Heros
Tollywood Director : మన సెలబ్రిటీలలో మల్టీ ట్యాలెంటెడ్ కూడా చాలా మంది ఉన్నారు. చాలా మంది డైరెక్టర్లు యాక్టర్స్ గా మెరిపిస్తారు. కొంతమంది నటులు డైరెక్టర్స్ గా కూడా సక్సెస్ అవుతారు. అదే కోవలో నటుడు అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన ఓ వ్యక్తి హీరోగా, నటుడిగా సినిమాలు చేసి, ఆడిషన్స్ ఇచ్చి ఇప్పుడు డైరెక్టర్ గా సినిమాలు చేస్తూ హిట్లు కొడుతున్నాడు.
అతను ఎవరో కాదు డైరెక్టర్ వెంకీ అట్లూరి. నటుడిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన వెంకీ అట్లూరి హీరోగా 2007 లో జ్ఞాపకం అనే ఓ సినిమా కూడా చేసాడు. ఆ తర్వాత రచయితగా పనిచేస్తూ పలు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసాడు. 2018లో తొలిప్రేమ సినిమాతో దర్శకుడిగా మరి హిట్ కొట్టాడు వెంకీ అట్లూరి. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల ధనుష్ తో సర్ సినిమా తీసి హిట్ కొట్టిన వెంకీ తాజాగా దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్ సినిమా తీసి దీపావళికి రిలీజ్ చేసి ఇంకో హిట్ కొట్టాడు.
అయితే తాజాగా లక్కీ భాస్కర్ సినిమా సక్సెస్ మీట్లో వెంకీ అట్లూరి తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నాడు. ఈ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చిన నాగ్ అశ్విన్ కూడా వెంకీ అట్లూరి నటుడి ప్రయాణం గురించి మాట్లాడాడు. డైరెక్టర్ వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. నాగ్ అశ్విన్, హను గారిని ఇక్కడ చూడటం సంతోషంగా ఉంది. నేను నటుడిగా ఉన్నప్పుడు చంద్రశేఖర్ యేలేటి గారి సినిమా కోసం హను గారు నన్ను ఆడిషన్ చేశారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాకు నాగి నన్ను ఆడిషన్ చేశాడు. ఇప్పుడు మేము ముగ్గురం దుల్కర్ గారితో సినిమాలు చేసి హిట్లు కొట్టాం అని ఆ రోజులను గుర్తుచేసుకున్నాడు.
అలాగే నాగ్ అశ్విన్ కూడా.. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాకు వెంకీని నేను ఆడిషన్ చేశాను. ఇప్పుడు డైరెక్టర్ గా వరుస హిట్స్ కొడుతున్నాడు అని అన్నారు. ఒకప్పుడు నటుడిగా సినిమాలకు ఆడిషన్స్ ఇచ్చిన వెంకీ అట్లూరి ఇప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు తీసి హిట్స్ కొడుతున్నాడు అంటూ అతన్ని అభినందిస్తున్నారు.