Orange Movie: ఆరెంజ్ రీ-రిలీజ్.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో అరుదైన రికార్డు!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజును ఆయన అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు ఘనంగా జరుపుకున్నారు. చరణ్ బర్త్‌డే సందర్భంగా కల్ట్ క్లాసిక్ రొమాంటిక్ మూవీ ‘ఆరెంజ్’ను రీ-రిలీజ్ చేశారు.

Orange Movie: ఆరెంజ్ రీ-రిలీజ్.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో అరుదైన రికార్డు!

Orange Movie Re-Release Makes A Unique Record

Updated On : March 28, 2023 / 1:47 PM IST

Orange Movie: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజును ఆయన అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు ఘనంగా జరుపుకున్నారు. చరణ్ బర్త్‌డే సందర్భంగా సోషల్ మీడియా మొత్తం చరణ్ పేరుతో మార్మోగిపోయింది. ఆయన నటిస్తున్న తాజా చిత్రానికి సంబంధించిన అప్డేట్లు, చరణ్‌కు సినీ రంగానికి చెందిన పలువురు విషెస్ చెబుతూ చరణ్ పేరును ట్రెండింగ్ చేశారు. ఇక ఆయన అభిమానులకు ఈ బర్త్‌డే చాలా స్పెషల్ అని చెప్పాలి.

Orange Re Release : ఆరెంజ్ రీ రిలీజ్.. నేను విన్నాను, నేను ఉన్నాను అంటున్న నాగబాబు..

ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ సాధించడంతో పాటు, చరణ్ కెరీర్‌లో కల్ట్ క్లాసిక్ రొమాంటిక్ మూవీగా నిలిచిన ‘ఆరెంజ్’ను రీ-రిలీజ్ చేశారు. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు పెద్దఎత్తున ఆసక్తిని కనబరిచారు. యూత్ ఈ సినిమాను మరోసారి థియేటర్లలో చూసేందుకు క్యూ కట్టారు. ఈ సినిమాను స్పెషల్ షోలు వేసిన అన్ని చోట్లా భారీ రెస్పాన్స్ అందుకుంది. ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఈ సినిమా ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

Orange Re Release : జనసేన కోసం చరణ్ బర్త్ డేకి ఆరెంజ్ రీ రిలీజ్..

ఈ సినిమా మొదటి 12 షోలకు పూర్తిగా హౌజ్‌ఫుల్ అయ్యి ఫస్ట్ ఆల్‌టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా మూడు రోజుల్లో 30 లక్షల మేర వసూళ్లు రాబట్టిన సినిమాగా సెన్సేషన్ క్రియేట్ చేయనుంది. ఏదేమైనా ఆరెంజ్ లాంటి సినిమాకు ఇలాంటి రెస్పాన్స్ దక్కడంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.