OTT Releases : ఒక పక్క థియేటర్‌లో ఆదిపురుష్.. మరో పక్క ఓటీటీలో బ్లాక్ బస్టర్ మూవీస్ రిలీజ్..

ఈ వీకెండ్ కి థియేటర్ అండ్ ఓటీటీలో బ్లాక్ బస్టర్ మూవీస్ సందడి చేయబోతున్నాయి. ఆ మూవీస్ లిస్ట్ ఇక్కడ తెలుసుకోండి.

OTT Releases : ఒక పక్క థియేటర్‌లో ఆదిపురుష్.. మరో పక్క ఓటీటీలో బ్లాక్ బస్టర్ మూవీస్ రిలీజ్..

OTT and theater Releases in this weekend Adipurush Bichagadu 2 Extraction 2

Updated On : June 15, 2023 / 6:15 PM IST

OTT Releases : ఈ వీకెండ్ మూవీ లవర్స్ కి పండుగ వాతావరణం కనిపించనుంది. ప్రభాస్ (Prabhas) మోస్ట్ అవైటెడ్ మూవీ ఆదిపురుష్ (Adipurush) రేపు జూన్ 16న రిలీజ్ కాబోతుంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ వద్ద హాలాహలంగా ఉంది. ఈ మూవీతో పాటు హాలీవుడ్ మూవీ ఫ్లాష్ (Flash) కూడా రేపు రిలీజ్ కాబోతుంది. ఇక ఈ రెండు మూవీలతో థియేటర్ లో సందడి కనిపించబోతుంటే.. ఓటీటీలో అంతకుమించి సందడి ఉండబోతుంది.

Pawan Kalyan OG : పవన్‌కి విలన్‌గా మారుతున్న బాలీవుడ్ రొమాంటిక్ స్టార్..

విజయ్‌ ఆంటోనీ (Vijay Antony) హీరోగా తెరకెక్కిన ‘బిచ్చగాడు 2’ (Bichagadu 2) ఇటీవల థియేటర్స్ లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ డేట్ ని ఫిక్స్ చేసుకుంది. జూన్‌ 18 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ లో ఈ సినిమా ప్రసారం కానుంది. ఇక 2020 లో థోర్ (Thor) స్టార్ క్రిస్‌ హేమ్స్‌ వర్త్‌ (Chris Hemsworth) నటించిన యాక్షన్ మూవీ ఎక్స్‌ట్రాక్షన్‌ (Extraction) డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ వస్తుంది. ఈ సీక్వెల్ కూడా డైరెక్ట్ ఓటీటీలోనే రిలీజ్ కాబోతుంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా జూన్‌ 16 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Allu Arjun : అల్లు అర్జున్ AAA థియేటర్ ఓపెన్.. మొదటి సినిమాగా ఆదిపురుష్.. టికెట్ బుకింగ్స్ ఓపెన్..

అలాగే నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్‌ శోభన్‌, మాళవిక హీరోహీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అన్నీ మంచి శకునములే’ సినిమా కూడా జూన్‌ 17 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ లో ప్రసారం కాబోతుంది. ఇక ‘సైతాన్‌’ అనే తెలుగు వెబ్ సిరీస్.. ఈ గురువారం నుంచే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ లో కానుంది. ఇటీవల ఈ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కాగా బోల్డ్ కంటెంట్ తో అందర్నీ షాక్ చేసింది. వీటితో పాటు మరికొన్ని ఓటీటీ రిలీజ్ లు గురించి క్రింద తెలుసుకోండి.

నెట్‌ఫ్లిక్స్‌

ది విలేజ్‌ (జపనీస్‌) – జూన్‌ 16
బ్లాక్‌ వకర్‌ (జపనీస్‌) – జూన్‌ 16

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

టూ సోల్స్‌ (తెలుగు) – జూన్‌ 15
తారమ్‌ తీర్థ కూడర్‌ (మలయాళం) – జూన్‌ 16
చార్లీస్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (మలయాళం) – జూన్‌ 16
కాందహార్‌ (ఇంగ్లీష్‌) – జూన్‌ 16
జీ కర్దా (హిందీ) – జూన్‌ 15
రావణకొట్టం (తమిళం) – జూన్‌ 16

జీ5

సియా (హిందీ) – జూన్‌ 16
తమిళరసన్‌ (తమిళ్‌) – జూన్‌ 16

సోనీలివ్‌

ఫర్హానా (తమిళ చిత్రం) – జూన్‌ 16

డిస్నీ+హాట్‌స్టార్‌

షెవలియర్‌ (హాలీవుడ్‌) – జూన్‌ 16