Aadi Keshava : మళ్ళీ పోస్టుపోన్ అయిన మెగా హీరో సినిమా.. ఈసారి కారణం అదేనట..
వైష్ణవ తేజ్, శ్రీలీల ‘ఆదికేశవ’ మళ్ళీ పోస్టుపోన్ అయ్యింది. ఈసారి వాయిదాకి కారణం..

Panja Vaisshnav Tej Sreeleela Aadi Keshava is again postponed
Aadi Keshava : వైష్ణవ తేజ్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న మూవీ ‘ఆదికేశవ’. సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని నవంబర్ 10న రిలీజ్ చేసేందుకు మేకర్స్ డేట్ ఫిక్స్ చేసి ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. ఈక్రమంలోనే మూడు సాంగ్స్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. జివి ప్రకాష్ ప్రకాష్ అందించిన సంగీతానికి వైష్ణవ తేజ్, శ్రీలీల డాన్స్ పర్ఫార్మెన్స్ కి ఆడియన్స్ నుంచి మంచి మార్కులు పడ్డాయి.
ఇక వీరిద్దరి ఎనర్జీని థియేటర్ లో మరింత ఎంజాయ్ చేద్దామని ఆడియన్స్ రెడీ అవుతుంటే.. మేకర్స్ మళ్ళీ పోస్టుపోన్ చేసి షాక్ ఇచ్చారు. ఇప్పటికే ఈ సినిమా పలుమార్లు పలు కారణాలు వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు కూడా నవంబర్ 10న కాకుండా 24న ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నామంటూ ప్రకటించారు. ఇక ఈసారి పోస్టుపోన్ వేయడానికి గల కారణం ఏంటంటే.. ప్రస్తుతం వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరుగుతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
ఆ ముందు వారం నుంచి అందరి దృష్టి వరల్డ్ కప్ పైనే ఉంటుంది. దీంతో సినిమా కలెక్షన్స్ పై ప్రభావం పడే అవకాశం ఉందని భావించిన నిర్మాతలు 24కి పోస్టుపోన్ చేశారు. మరి ఈసారైనా చెప్పిన తేదికి వస్తుందా లేదా చూడాలి. కాగా వైష్ణవి తేజ్ కి ఉప్పెన తరువాత సరైన హిట్టు పడలేదు. మరి ఈ చిత్రంతో అయినా ఒక సూపర్ హిట్టుని అందుకొని కమ్‌బ్యాక్ ఇస్తాడా అనేది చూడాలి.
View this post on Instagram