Parineeti Chopra : IPL మ్యాచ్ లో సందడి చేసిన పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా.. ఫోటో వైరల్!
ప్రియుడుతో కలిసి ఐపీయల్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన పరిణీతి చోప్రా. రాఘవ్ చద్దాతో కలిసి ఉన్న పిక్ వైరల్ అవుతుంది.

Parineeti Chopra Raghav Chadha spotted enjoying punjab and mumbai ipl match
Parineeti Chopra : బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా (Parineeti Chopra) ఇటీవల బి-టౌన్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీకి(AAP) పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాతో (Raghav Chadha) ఈ భామ డేటింగ్ చేస్తున్నట్లు గత కొంత కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ముంబైలో డిన్నర్, లంచ్ అంటూ రెస్టారెంట్స్ చుట్టూ కనిపిస్తూ సందడి చేస్తున్నారు. దీంతో మీడియా అండ్ సోషల్ నెట్ వర్క్స్ అనేక వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ మాత్రం వారి రిలేషన్ పై ఎటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు.
Sarath Babu : ఆ వార్తలు నమ్మొద్దు.. శరత్ బాబు సిస్టర్ క్లారిటీ!
తాజాగా మరోసారి ఈ జంట కెమెరా లెన్స్ కి చిక్కారు. ప్రస్తుతం దేశంలో ఐపీయల్ (IPL) జరుగుతున్న విషయం తెలిసిందే. ఈరోజు పంజాబ్ అండ్ ముంబై మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ చూసేందుకు రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా పంజాబ్ లోని మొహాలీ స్టేడియంకి హాజరయ్యారు. దీంతో స్టేడియంలో అందరి దృష్టి వారి పైనే పడ్డాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Pawan Kalyan OG : పుణేలో పవన్ OG షూటింగ్.. సాంగ్ షూట్ జరుగుతుందా?
కాగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పరిణీతి చోప్రాని రాఘవ్ తో డేటింగ్ విషయం గురించి ప్రశ్నించగా.. పరిణీతి కొంచెం ఘాటుగానే రియాక్ట్ అయ్యింది. “ఇది నా జీవితం. నా జీవితాన్ని నేను చూసుకోగలను. ఏదైనా ఉంటే నేనే స్వయంగా తెలియజేస్తాను. నేను ఎక్కడ కనపడినా ఎక్కడికి వెళ్తున్నాను, ఎవరితో వెళ్తున్నాను అనే విషయాలు మీకు అనవసరం” అంటూ వెల్లడించింది. డైరెక్ట్ గా రాఘవ్ గురించి మాత్రం మాట్లాడకుండా ఏమైనా ఉంటే తానే చెప్తాను అని చెప్పడంతో రాఘవ్ తో డేటింగ్ లో ఉందా, లేదా అన్న ప్రశ్న అలానే ఉండి పోయింది.
When Politics meets Bollywood
Raghav Chadha and Parineeti Chopra spotted enjoying a game together at the Mohali Stadium#PBKSvMI pic.twitter.com/YWJd47M6yT
— Siddharth (@ethicalsid) May 3, 2023