Pawan Kalyan : నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్.. ఆ నంబర్ వన్ స్థానంలో పవన్ కళ్యాణ్ ..
ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాలు చెయ్యనప్పటికీ నార్త్ ఆడియెన్స్ లో కూడా భారీ క్రేజ్ తెచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్.

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో ఎంత బిజీగా ఉన్నడో తెలిసిందే. రాజకీయాల కారణంగా సినిమాలకి బ్రేక్ ఇచ్చిన పవన్ తిరిగి మళ్ళీ ఇప్పుడు సినిమాలతో బిజీ అయ్యారు. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు పవన్.
ఇదిలా ఉంటే.. పవన్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నేషనల్ లెవెల్లో ఆయనకి క్రేజ్ ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాలు చెయ్యనప్పటికీ నార్త్ ఆడియెన్స్ లో కూడా భారీ క్రేజ్ తెచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్. అయితే ఇప్పుడు కేవలం నేషనల్ లెవెల్ లోనే కాదు ఇంటెర్నేషనల్ స్థాయికి పవన్ క్రేజ్ చేరింది. గూగుల్ ట్రెండింగ్ లో పవన్ కళ్యాణ్ నంబర్ 1 స్థానంలో నిలిచాడు.
Also Read : Manchu Manoj : ‘సాయంత్రం అన్నీ చెప్పేస్తా’.. కన్నీళ్లతో మరోసారి మీడియా ముందుకు మనోజ్..
ఈ ఏడాది గూగుల్ లో అత్యధిక శాతం మంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి సెర్చ్ చేసారు. సినిమా, రాజకీయ వర్గాలను అన్నిటిని కలిపి చూస్తే, గూగుల్ ట్రెండింగ్ లో పవన్ కళ్యాణ్ నంబర్ 1 స్థానంలో నిలిచాడు. రీసెంట్ గా ‘సీజ్ ద షిప్’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వైరల్ గా మారాయి. ఈ వీడియో కోసం ఆడియన్స్ గూగుల్లో తెగ వెతికారు. దీంతో గూగుల్ ట్రెండింగ్ లో నంబర్ 1లో ఆయన పేరు వచ్చింది. హీరోలు, రాజకీయ నాయకుల కేటగిరీలో పవన్ కళ్యాణ్ మొదటి స్థానంలోనిలిచారు. ఆయన తర్వాత చిరాగ్ పాశ్వాన్ రెండో స్థానంలో, నరేంద్ర మోడీ మూడో స్థానంలో, చంద్రబాబు నాలుగో స్థానంలో నిలిచారు. దీంతో పవన్ ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు.