అన్నయ్య, వదిన నాకు తల్లిదండ్రులతో సమానం.. పవన్ భావోద్వేగం..

  • Published By: sekhar ,Published On : August 22, 2020 / 03:35 PM IST
అన్నయ్య, వదిన నాకు తల్లిదండ్రులతో సమానం..  పవన్ భావోద్వేగం..

Updated On : August 22, 2020 / 3:56 PM IST

Pawan Kalyan Birthday wishes to Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీపరిశ్రమకు చెందిన నటీనటులు, దర్శక నిర్మాతలు చిరుకి బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు.



ఈ సందర్భంగా చిరు సోదరుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ భావోద్వేగానికి లోనయ్యారు. తన అన్నయ్య మీద ఉన్న ప్రేమను తెలియజేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. చిరంజీవికి తమ్ముడిగా పుట్టడం తన అదృష్టమని, అన్నయ్య, వదిన తనకు తల్లిదండ్రులతో సమానమని ఎమోషనల్‌ అయ్యారు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అసామన్యుడిగా ఎదిగి, తనలాంటి ఎందరికో స్ఫూర్తి ప్రధాతగా నిలిచిన వ్యక్తి చిరంజీవి అని​ కొనియాడారు. చిరంజీవి తనకు కేవలం అన్నయ్యే కాకుండా దైవంతో సమానమని వెల్లడిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.



అన్నయ్య చేయిపట్టి పెరిగానని, ఆయనే తన తొలిగురువు అని పవన్‌ పేర్కొన్నారు. అంచెలంచెలుగా ఎదిగి కొట్లాది మంది అభిమనులు, శ్రేయోభిలాషుల గుండెల్లో చిరస్మరణమైన స్థానాన్ని సంపాదించిన గొప్ప వ్యక్తి చిరంజీవి అని పొగిడారు. ఆయన ఎదుగుదల ఆయనలోని సేవా తత్పరతను ఆవిష్కరింపజేసిందన్నారు. ఆయనలా నటుడవుదామని, ఆయనలా అభినయించాలని కొందరు స్ఫూర్తి పొందితే, ఆయనలా సేవ చేయాలని మరెందరో ప్రేరణ పొందారని పవన్‌ పేర్కొన్నారు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన చిరంజీవి జన్మదినం సందర్భంగా తెలుగువారందరూ ఆయనను ఆశీర్వదించాలని.. శ్రీ చిరంజీవి గారికి చిరాయువుతో కూడిన సుఖశాంతులు ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.. అన్నయ్యకు ప్రేమపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.. అని పవన్‌ పేర్కొన్నారు.

Pawan Letter