Pawan – Karan : పవన్ సినిమా దగ్గరిలో కూడా లేవు.. కరణ్ జోహార్ మూవీ కలెక్షన్స్..

భారీ స్టార్ క్యాస్ట్ తో దాదాపు 8 రాష్ట్రాల్లో రిలీజ్ అయిన బాలీవుడ్ మూవీ కలెక్షన్స్.. కేవలం రెండు రాష్ట్రాల్లో రిలీజ్ పవన్ సినిమా దగ్గరిలో కూడా లేవు.

Pawan – Karan : పవన్ సినిమా దగ్గరిలో కూడా లేవు.. కరణ్ జోహార్ మూవీ కలెక్షన్స్..

Pawan Kalyan Bro collections more than Karan Johar Rocky Aur Rani Ki Prem Kahani

Updated On : July 30, 2023 / 4:18 PM IST

Pawan Kalyan – Karan Johar : ఈ వారం రెండు పెద్ద సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చాయి. ఒకటి బాలీవుడ్ మూవీ ‘రాకీ ఔర్‌ రాణీ కి ప్రేమ్‌ కహానీ’ (Rocky Aur Rani Ki Prem Kahani), మరొకటి టాలీవుడ్ చిత్రం బ్రో (Bro). ఈ రెండు సినిమాలు జులై 28న ఆడియన్స్ ముందుకు వచ్చాయి. బాలీవుడ్ చిత్రంలో రణవీర్ సింగ్, అలియా భట్ హీరోహీరోయిన్లుగా నటించారు. ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమాని తెరకెక్కించాడు. ఇక బ్రో.. పవన్ అండ్ సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ అని తెలిసిందే.

Naresh : మంచు విష్ణు గెలుపు వెనుక ఉన్న నరేష్.. మా బిల్డింగ్ గురించి అడిగితే.. తననే అడగండి అంటూ..

కాగా భారీ స్టార్ క్యాస్ట్ తో వచ్చిన ఈ రెండు సినిమాలు కేవలం తమతమ భాషల్లో మాత్రమే రిలీజ్ అయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయిన బ్రో మూవీ మొదటి రోజు.. 35 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఓవర్ సీస్ కూడా కలుపుకొని మొత్తం ప్రపంచవ్యాప్తంగా 48 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. కానీ ‘రాకీ ఔర్‌ రాణీ కి ప్రేమ్‌ కహానీ’ నార్త్ లో దాదాపు 8 రాష్ట్రాల్లో రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ గా.. రూ.11 కోట్లు మాత్రమే అందుకోవడం విశేషం. ఇక రెండోరోజు కలెక్షన్స్ ని కలుపుకొని పవన్ మూవీ.. 75 కోట్ల మార్క్ దాటేసి 100 కోట్ల వైపు పరుగులు పెడుతుంది.

Kalki 2898 AD : కల్కి టీజర్ రివ్యూస్ పరిశీలిస్తున్న మూవీ టీం.. ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్‌ని ట్రోల్..

కానీ కరణ్ జోహార్ సినిమా రెండు రోజు 16 కోట్లు కలెక్షన్స్ అందుకొని మొత్తం మీద 30 కోట్లు గ్రాస్ కూడా దాటలేకపోయింది. కాగా బ్రో మూవీ 80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. రణవీర్ మూవీ దాదాపు 160 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. రెండు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ గానే ఆడియన్స్ ముందుకు వచ్చాయి. కానీ కలెక్షన్స్ లో మాత్రం పవన్ సినిమానే దూకుడు చూపిస్తుంది. ఒక రీమేక్ అయ్యుండి, అదికూడా కేవలం రెండు రాష్ట్రాల కలెక్షన్స్ తోనే బాలీవుడ్ మూవీ కంటే డబుల్ మార్జిన్ లో కలెక్షన్స్ రాబట్టడంతో టాలీవుడ్ ఆడియన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.