Pawan Kalyan : సినిమాలు తీసేవాళ్ళే సినిమాల గురించి మాట్లాడాలి.. సినిమాలకు రాజకీయ రంగు పులమొద్దు..
పవన్ కళ్యాణ్ సినిమా, చరణ్, చిరంజీవి గురించి మాట్లాడిన అనంతరం..

Pawan Kalyan Comments on Movies and Politics in Game Changer Movie Pre Release Event
Pawan Kalyan : నేడు జరిగిన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమా, చరణ్, చిరంజీవి గురించి మాట్లాడిన అనంతరం.. టాలీవుడ్, బాలీవుడ్ అని ఎందుకు విడదీస్తారు. మొత్తం ఇండియన్ సినిమా ఒకటే. హాలీవుడ్ నుంచి వుడ్ మాత్రమే తీసుకున్నారు కానీ టెక్నికల్, డిసిప్లీన్ తీసుకోలేదు. డిసిప్లీన్ ఉండాలి సినిమా పరిశ్రమలో. సినిమాల గురించి సినిమాలు తీసేవాళ్ళే మాట్లాడాలి. మన కథలు చెప్పాలి. సొంత కథలతో రావాలి. కథలు కాపీ చేస్తా అంటే కుదరదు. సినిమాలు తీయకుండా రాజకీయాలు చేసేవాళ్ళు మాట్లాడకూడదు. సినిమా బాధల గురించి తెలిసిన వాళ్ళే సినిమాల గురించే మాట్లాడాలి. అలాంటి వాళ్ళతోనే మా ప్రభుత్వం మాట్లాడతాం. సినిమాలకు రాజకీయాలు పూలమొద్దు అని అన్నారు. దీంతో పవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Also Read : Pawan Kalyan : టికెట్ రేట్లు ఎందుకు పెంచుతున్నాం అంటే.. టికెట్ రేట్ల పెంపుపై క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్..