Pawan Kalyan : నన్ను అందరూ రీమేక్స్ చేస్తారని అంటారు.. ఎందుకంటే.. నా కోసం నిలబడింది త్రివిక్రమ్ ఒక్కడే.. పవన్ కళ్యాణ్ ఫుల్ స్పీచ్..

హరి హర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..

Pawan Kalyan : నన్ను అందరూ రీమేక్స్ చేస్తారని అంటారు.. ఎందుకంటే.. నా కోసం నిలబడింది త్రివిక్రమ్ ఒక్కడే.. పవన్ కళ్యాణ్ ఫుల్ స్పీచ్..

Pawan Kalyan

Updated On : July 21, 2025 / 10:22 PM IST

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు సినిమా లవర్స్ కూడా ‘హరి హర వీరమల్లు’ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఎ. దయాకర్ రావు నిర్మాణంలో ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 24న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, సాంగ్స్, ట్రైలర్ రిలీజ్ చేసి అంచనాలు పెంచారు.

నేడు హరి హర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.

Also Read : Hari Hara VeeraMallu : హరిహర వీరమల్లుకు తెలంగాణలో కూడా టికెట్ రేట్లు పెంపు.. ఎంతంటే..?

ఈ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. అందరి సినిమాలకు వందల్లో టికెట్ రేట్లు ఉంటే భీమ్లా నాయక్ నా సినిమాకు పది రూపాయలు టికెట్ రేటు పెట్టారు. అప్పుడే చెప్పా మనల్ని ఎవడ్రా ఆపేది అని. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ రికార్డుల కోసం ప్రయత్నం చేయలేదు. నేనేం కోరుకోలేదు. ఇప్పుడు నా అభిమానుల కోసమే మాట్లాడతాను. నేను పడి లేచినా ఇక్కడ ఉన్నాను అంటే కారణం మీరే. నేను పడినా లేచినా అన్నా నీ వెంట మేము ఉన్నాం అన్నారు. నా దగ్గర ఆయుధాలు, గుండాలు లేరు. గుండెల్లో మీరు తప్ప. నేను సినీ పరిశ్రమకు వచ్చి ఆల్మోస్ట్ 29 ఏళ్ళు అయింది. గబ్బర్ సింగ్ సమయంలో ఒక మహబూబ్ నగర్ నుంచి వచ్చిన అభిమాని గురించి చెప్పా. అన్నా నువ్వు మాకేమి ఇవ్వొద్దు ఒక హిట్ ఇవ్వు అని అడిగాడు. అప్పుడు దేవుడ్ని కోరుకున్నా. హిట్ వచ్చింది. కానీ ఇది చాలా కష్ట సమయాల్లో సినిమా చేశా. జానీ సినిమా ఫ్లాప్ అయితే వరుసగా హిట్లు కొట్టి కూడా ఒక్క సినిమా ఫ్లాప్ అయితే ఎవ్వరు వదిలేసినా మీరు వదల్లేదు. ధనం మూలం మిదం జగత్. నేను హిట్స్, ఫ్లాప్ వదిలేసి నా అభిమానులను నమ్ముకున్నాను. డబ్బుకు ఎప్పుడూ ప్రాధాన్యత ఇవ్వలేదు. బంధాలకు ప్రాముఖ్యత ఇచ్చాను.

ప్రధాని నుంచి నాకు అందరూ తెలుసు నాకు కానీ డబ్బులు రావు. సినిమాల నుంచే నాకు డబ్బులు వస్తాయి. మీరంతా నన్ను తిడతారు కదా రీమేక్ లు చేస్తారని కానీ ఏం చేయాలి. మనకి దర్శకులు ఎవరూ లేరు. నన్ను అందరూ కూడా రీమేక్ చేస్తే డబ్బులు వస్తాయి అన్నారు. ఒక్క ఫ్లాప్ చేశా అంతే దాని తర్వాత గ్రిప్ రాలేదు సినిమా ఇండస్ట్రీ మీద. కానీ నా కోసం నిలబడింది త్రివిక్రమ్ ఒక్కడే. ఫ్లాప్స్ లో ఉంటే ఎవరూ రారు, కానీ త్రివిక్రమ్ వచ్చాడు. నా స్నేహితుడు త్రివిక్రమ్ భగవంతుడు ఇచ్చాడు. నేను ఫ్లాప్స్ లో ఉన్నప్పుడు జల్సా ఇచ్చాడు నాకు. ఎందుకు రీమేక్స్ చేసారు అని అడుగుతారు కదా. డబ్బుల కోసమే. నా పార్టీని ఎవరు నడుపుతారు? నా భార్య పిల్లలను ఎవరు పోషిస్తారు? నాకు వేరే దారి లేక రీమేక్ లు చేస్తున్నాను. అలాంటి నేను ఒక మంచి సినిమా మీ కోసం చేయాలి అనుకున్నా. అదే హరిహర వీరమల్లు.

Also Read : AM Rathnam : అందరూ OG.. OG.. అని అరుస్తుంటే బాధగా ఉండేది.. హరిహర వీరమల్లు నిర్మాత కామెంట్స్..

నాకు సినిమా లేట్ అయిన ప్రతిసారి నిరుత్సాహం వచ్చేది. అలాంటప్పుడు కీరవాణి ఈ సినిమాకు ఇచ్చిన మ్యూజిక్ చూస్తే ప్రాణం లేచి వచ్చేది. కెమెరామెన్ కి రోజుకి 2 గంటలే ఇవ్వగలను అని చెప్తే మంగళగిరిలో నా ఆఫీస్ కి దగ్గరగా ఓ స్థలంలో సెట్స్ వేసి షూట్ చేసారు ప్లాన్ చేసుకొని. నిధి ఒక్కతే ఈ సినిమాని ముందుకు నడిపించింది ప్రమోషన్స్ చేసి. ఆమెని చేసి సిగ్గు తెచ్చుకొని నేను ప్రమోషన్స్ కి వచ్చాను. రేపు, ఎల్లుండి కూడా ప్రమోషన్స్ కి వస్తాను. భీమ్లా నాయక్ కి టికెట్ రేట్లు ఎలా చేసారో తెలుసు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది. రేట్లు పెరిగాయి. ఇప్పుడు హరిహర వీరమల్లు ఏం చేస్తుందో చూస్తారు.

మన దేశం ఎవరిమీద ఆక్రమణ చేయలేదు. మనమీదే అందరు చేసారు. మన స్కూల్ పుస్తకాల్లో మొగల్స్ గురించి గొప్పగా చెప్పారు కానీ వాళ్ళు చేసిన చెడు చెప్పలేదు. ఔరంగజేబు హిందువుగా బతకాలంటే ట్యాక్స్ కట్టమని పెట్టాడు. అలాంటి సమయంలో ఛత్రపతి శివాజీ వచ్చాడు. ఆ సమయంలో ఉన్న హరిహర వీరమల్లు కథ ఇది. కోహినూర్ కృష్ణ నది తీరాన నుంచి నిజాం నుంచి మొగల్స్ దాకా వెళ్లి ఇప్పుడు లండన్ లో ఉంది. ఆ కోహినూర్ కథ ఇది.

ఈ సినిమా కలెక్షన్స్, రికార్డుల గురించి నేను మాట్లాడాను. కానీ మేము నా బెస్ట్ ఇచ్చాను. మీ కోసం డ్యాన్స్ వేసాను. పొలిటికల్ గా వెళ్లి రియల్ లైఫ్ గూండాలను ఎదుర్కొన్నాను కానీ ఈ సినిమాలో మార్షల్ ఆర్ట్స్ రెండు నెలలు ట్రైనింగ్ నేర్చుకొని నేను గతంలో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ అన్ని ఉపయోగించి ఈ సినిమాలో 18 నిమిషాల ఫైట్స్ కంపోజ్ చేశాను. ధర్మం కోసం పోరాడే కథ. ఇది సస్పెన్స్ కథ కాదు. మీరు కోరుకున్న సక్సెస్ నేను కూడా ఆశిస్తున్నాను. మీకు సినిమా నచ్చితే బద్దలు కొట్టేయండి. మీరే నా బలం. నేను కష్టాల్లో, ఓటమిలో ఉన్నా అన్నా మీకు మేము ఉన్నాం అని నా కోసం ముందుకు వచ్చారు. ఈ గుండె మీ కోసమే కొట్టుకుంటుంది. మళ్ళీ వైజాగ్ లో కలుద్దాం అని అన్నారు.

Also Read : Hari Hara Veeramallu Press Meet : పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ప్రెస్ మీట్ ఫొటోలు.. పవన్ స్టైలిష్ లుక్స్ వైరల్..