Hari Hara Veera Mallu : మీసం మెలేసిన హరిహరవీరమల్లు.. వీడియో వైరల్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఇచ్చిన మాట ప్రకారం ఓ వైపు రాజకీయాల్లో ప్రజలకు సేవ చేస్తూనే మరో వైపు సినిమా షూటింగ్స్‌లో కూడా పాల్గొంటున్నారు.

Pawan Kalyan kicks off the latest schedule of Hari Hara Veera Mallu
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఇచ్చిన మాట ప్రకారం ఓ వైపు రాజకీయాల్లో ప్రజలకు సేవ చేస్తూనే మరో వైపు సినిమా షూటింగ్స్‌లో కూడా పాల్గొంటున్నారు. ముందుగా హరిహర వీరమల్లు సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. జ్యోతి కృష్ణ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్ర లాస్ట్ షెడ్యూల్ లో పవన్ పాల్గొంటున్నారు. మంగళగిరిలో వేసిన ప్రత్యేక సెట్‌లో యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నారు.
తాజాగా ఓ ఫోటోషూట్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎందుకంటే ఈ షూట్ కోసం భారతీయ తొలి పొటోమెట్రిక్ 3 డీ స్కానింగ్ టెక్నాలజీ వినియోగించారు. రౌండప్‌గా ఉన్న లైట్లు, కెమెరాల మధ్య నిలబడిన హరిహరవీరమల్లు మీసం మెలేస్తున్న విజువల్స్ అదిరిపోయాయి.
ఈ మూవీలో నిధి అగర్వాల్ కథానాయిక. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Pushpa 2 : పుష్ప ఈవెంట్ లో సుక్కు భార్య కంటతడి.. భర్త సక్సెస్ చూసి..
Power star @PawanKalyan kicks off the latest schedule of #HariHaraVeeraMallu with Power-packed energy!!
In theaters on 28th March 2025!
pic.twitter.com/PliTaUqUgW— Sreenivas Gandla (@SreenivasPRO) December 3, 2024