Pawan Kalyan: ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చిన పవన్ కల్యాణ్
మరోవైపు పవన్ డేట్స్ ఇచ్చినా..సరిగ్గా వాడుకోలేదనే వాదన ఉండటంతో ప్రస్తుతం సినిమాలు చేస్తున్న మేకర్స్ ఈసారి అలాంటి మిస్టేక్ చేయొద్దని అనుకుంటున్నారట.

పవర్ స్టార్… ఆయనకున్న ఫ్యాన్ బేసే వేరు. సేనాని సినిమా రిలీజ్ అంటే థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే. పాలిటిక్స్‌లో ఫుల్ యాక్టివ్‌గా ఉండటంతో కొన్నాళ్లుగా పవన్ సినిమాలు చేయడం లేదు.. ఆయన మూవీస్ రిలీజ్‌లు కూడా లేవు. గతంలో ఒప్పుకున్న మూవీస్ షూటింగ్‌ను పూర్తి చేసేందుకే పవన్‌కు టైమ్ దొరకడం లేదు.
ఇదే విషయాన్ని చెప్తూ వస్తున్నారు పవన్. ఇప్పటికే తాను కమిట్ అయిన మూడు సినిమాలు ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కంప్లీట్ అయ్యాకా..సినిమాలకు దూరంగా ఉంటానంటూ పవర్ స్టార్ చేసిన కామెంట్స్..కొందరు మేకర్స్‌ను షాక్‌కు గురి చేశాయట.
పవన్‌తో సినిమాలు చేయాలని ఎదురుచూస్తున్న నిర్మాతలు, డైరెక్టర్లు..పవర్ స్టార్ కామెంట్స్‌తో డైలమాలో పడిపోయారట. గతంలో కూడా పవన్ ఇలానే సినిమాలు చేయనని..మళ్ళీ స్టార్ట్ చేశారు. కానీ ఈసారి అలా ఉండదు..ఎందుకంటే ఇప్పుడు పవన్ ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు కూడా. ఇక ఫుల్ టైమ్ పాలిటిక్స్‌లోనే బిజీగా ఉండనున్నారు పవన్. సో డైరెక్టర్లు చెప్పే స్టోరీలు వినే టైమ్ కూడా సేనానికి ఉండకపోవచ్చంటున్నారు.
కానీ పవన్ ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రెడీగా ఉన్నామంటున్నారు కొందరు డైరెక్టర్లు. మరోవైపు పవన్ డేట్స్ ఇచ్చినా..సరిగ్గా వాడుకోలేదనే వాదన ఉండటంతో ప్రస్తుతం సినిమాలు చేస్తున్న మేకర్స్ ఈసారి అలాంటి మిస్టేక్ చేయొద్దని అనుకుంటున్నారట. పవర్ స్టార్ ఆ మూడు మూవీస్ తర్వాత మళ్లీ సినిమాలు చేస్తారా లేక..చెప్పినట్లుగానే అంతటితో ఆపేస్తారా అనేది వేచి చూడాలి మరి.
2025 Movies : 2025 లో మోస్ట్ వెయిటింగ్ సినిమాలు ఇవే..