Nani : పవన్ కళ్యాణ్ OG సాంగ్.. నాని సినిమాకు టైటిల్ గా.. సుజీత్ సినిమాటిక్ యూనివర్స్..
సుజీత్ ప్రస్తుతం నానితో సినిమా చేస్తున్నాడు. (Nani)
Nani
Nani : ఇటీవల సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన OG సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. సుజీత్ ప్రభాస్ తో తీసిన సాహో – OG సినిమాలకు లింక్ ఇచ్చి సుజీత్ సినిమాటిక్ యూనివర్స్ ప్రకటించడంతో పాటు OG సినిమాకు సీక్వెల్ ప్రకటించడంతో సుజీత్ నెక్స్ట్ సినిమాలపై అంచనాలు నెలకొన్నాయి.(Nani)
సుజీత్ ప్రస్తుతం నానితో సినిమా చేస్తున్నాడు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ది ప్యారడైజ్ సినిమాతో బిజీగా ఉన్న నాని ఆ సినిమా అవ్వగానే సుజీత్ సినిమా షూటింగ్ మొదలుపెడతాడు. ఇటీవలే సుజీత్ – నాని సినిమా ఓపెనింగ్ జరిగింది. ఈ సినిమా కూడా సాహో – OG లాగే డాన్, యాక్షన్ నేపథ్యంలో ఉండబోతుందని తెలుస్తుంది.
Also Read : Sivaji Raja : ఐ బొమ్మ రవి లాంటి వాళ్ళు జైల్లోనే ఉండాలి.. అతనికి సపోర్ట్ చేయడం అంటే అలాంటిదే..
తాజాగా నాని – సుజీత్ సినిమా టైటిల్ వైరల్ గా మారింది. OG సినిమాతో పాటు పాటలు కూడా వైరల్ అయ్యాయి. అందులో గన్స్ & రోజెస్ అనే స్టైలిష్ సాంగ్ కూడా OG లో ఉంది. ఇప్పుడు నాని – సుజీత్ సినిమాకు గన్స్ & రోజెస్ అనే టైటిల్ నే పెట్టనున్నట్టు టాలీవుడ్ సమాచారం. గతంలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ లోని పదాలను సినిమా టైటిల్స్ గా మార్చారు.
ఇప్పుడు పవన్ OG సినిమాలోని గన్స్ & రోజెస్ సాంగ్ ని ఈ సినిమాకు టైటిల్ గా వాడేశారు. అలాగే ఈ సినిమా కూడా సుజీత్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమే అని సమాచారం. దీంతో నాని – సుజీత్ సినిమా కోసం నాని ఫ్యాన్స్ మాత్రమే కాక పవన్, ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు.
Also Read : Actress Hema : నా ఇమేజ్ డ్యామేజ్ అయింది.. అవకాశాలు తగ్గాయి.. అందరికి దూరంగా ఉండాలనే బిగ్ బాస్ కు..
