Sivaji Raja : ఐ బొమ్మ రవి లాంటి వాళ్ళు జైల్లోనే ఉండాలి.. అతనికి సపోర్ట్ చేయడం అంటే అలాంటిదే..
సీనియర్ నటుడు శివాజీ రాజా ఇంటర్వ్యూ ఇవ్వగా ఐ బొమ్మ గురించి, రవి అరెస్ట్ గురించి మాట్లాడారు. (Sivaji Raja)
Sivaji Raja
Sivaji Raja : ఐ బొమ్మ వెబ్ సైట్ లో సినిమాలను పైరసీ చేయడంతో టాలీవుడ్ కి వేలకోట్ల నష్టం జరిగింది. నన్నేమి చేయలేరు అని ఛాలెంజ్ చేయడంతో పోలీసులు ఫోకస్ చేసి మరీ ఐ బొమ్మ అడ్మిన్ రవిని అరెస్ట్ చేసారు. దీంతో ఆ సైట్ లో ఫ్రీగా సినిమాలు చూసే బ్యాచ్ అతనిని సపోర్ట్ చేస్తుంటే పలువురు మాత్రం విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో సినీ ప్రముఖులు కూడా ఐ బొమ్మ రవిపై ఫైర్ అవుతున్నారు.(Sivaji Raja)
తాజాగా 10 టీవీ ఛానల్ కి సీనియర్ నటుడు శివాజీ రాజా ఇంటర్వ్యూ ఇవ్వగా ఐ బొమ్మ గురించి, రవి అరెస్ట్ గురించి మాట్లాడారు.
Also Read : Actress Hema : నా ఇమేజ్ డ్యామేజ్ అయింది.. అవకాశాలు తగ్గాయి.. అందరికి దూరంగా ఉండాలనే బిగ్ బాస్ కు..
శివాజీ రాజా మాట్లాడుతూ.. వందల కోట్లు పెట్టి సినిమా తీస్తే వాడెవడో దొంగచాటుగా చూపిస్తాను అంటే 20 ఏళ్ళు పెంచిన అమ్మాయిని ఎవరో ఎత్తుకుపోయినట్టే. అది చాలా బాధ. కొంతమంది టికెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయని ఐ బొమ్మ రవిని సపోర్ట్ చేస్తున్నారు. నేను మాత్రం చేయను. మరి రీసెంట్ గా రిలీజ్ అయిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా 99 రూపాయలే కదా. టాప్ స్టార్స్ అంతా పెద్ద సినిమాలు, ఎక్కువ ఖర్చుపెట్టి, ఎక్కువ రోజులు కష్టపడి సినిమా చేస్తున్నారు అలాంటిది ఫ్రీగా చూపిస్తే బాధగా ఉండదా.
నేను కూడా ఒకానొక సమయంలో ఐ బొమ్మలో సినిమా చూద్దాం అనుకున్నా. నా ఫ్రెండ్ వల్ల తెలిసింది ఇలాంటి ఒక సైట్ ఉంది అని. పోలీసులు అరెస్ట్ చేసాక ఇంకా ఎక్కువగా తెలిసింది దీని గురించి. అతన్ని అరెస్ట్ చేసారు పైరసీ ఏమైనా ఆగిందా? అలాంటి వాళ్ళను స్ట్రిక్ట్ గా పనిషమెంట్ చేయాలి. లేకపోతే ఎవరూ భయపడరు. ఇప్పుడు ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, ఒక లాయర్ ని పెట్టుకొని బయటకు వచ్చి మళ్ళీ చేస్తారు. ఇంక వేరే వాళ్ళు ఎందుకు భయపడతారు. అలాంటి వాళ్ళు బయటకు రాకూడదు, అప్పుడు తెలుస్తుంది. అరబ్ కంట్రీస్ లో తప్పు చేయడానికి భయపడతారు ఎందుకంటే అక్కడ స్ట్రిక్ట్ రూల్స్ కానీ ఇక్కడ భయపడరు అని అన్నారు.
Also Read : Sivaji Raja : నేను చనిపోయేదాకా బీజేపీనే.. పొలిటికల్ కెరీర్ గురించి శివాజీరాజా వ్యాఖ్యలు..
