Akira Nandan – Aadya : సంక్రాంతికి పవన్ కొడుకు, కూతురు ట్రెడిషినల్ లుక్స్ చూశారా..? పవన్ సాంగ్ పెట్టి పోస్ట్ చేసిన రేణు దేశాయ్..

అకిరా నందన్, ఆద్యలు ఆల్రెడీ ఫేమస్ అయ్యారు. వీరి గురించి ఏ చిన్న వార్త వచ్చినా, ఫోటో, వీడియో వచ్చినా వైరల్ అయిపోతుంది.

Akira Nandan – Aadya : సంక్రాంతికి పవన్ కొడుకు, కూతురు ట్రెడిషినల్ లుక్స్ చూశారా..? పవన్ సాంగ్ పెట్టి పోస్ట్ చేసిన రేణు దేశాయ్..

Pawan Kalyan Renu Desai Childrens Akira Nandan Aadya Sankranthi Special Traditional Video goes Viral

Updated On : January 15, 2024 / 1:50 PM IST

Akira Nandan – Aadya : పవన్ కళ్యాణ్(Pawan Kalyan) – రేణు దేశాయ్(Renu Desai) కొడుకు, కూతుళ్లుగా అకిరా నందన్, ఆద్యలు ఆల్రెడీ ఫేమస్ అయ్యారు. వీరి గురించి ఏ చిన్న వార్త వచ్చినా, ఫోటో, వీడియో వచ్చినా వైరల్ అయిపోతుంది. అకిరా, ఆద్య ఇద్దరూ తల్లి రేణు దేశాయ్ దగ్గరే ఉంటారు. అప్పుడప్పుడు పవన్ దగ్గరకు వెళ్తారు. పవన్ వాళ్ళకి కావాల్సినవి అన్ని ఏర్పాటు చేస్తాడు.

ఇటీవల అకిరా నందన్ సినిమాల్లోకి వస్తాడని బాగా వార్తలు వచ్చాయి. కానీ రేణు దేశాయ్ వాటికి క్లారిటీ ఇచ్చింది. హీరోగా మాత్రం రాడు అని చెప్పేసింది. ప్రస్తుతం అకిరా అమెరికాలోని ఓ ఫిలిం స్కూల్ లో మ్యూజిక్ కి సంబంధించి కోర్స్ నేర్చుకుంటున్నట్టు సమాచారం. తాజాగా సంక్రాంతి పండక్కి ఇంటికి వచ్చాడు అకిరా. దీంతో అకిరా, ఆద్య పండక్కి ట్రెడిషినల్ గా రెడీ అయి ఫొటోలు దిగారు.

Also Read : Guntur Kaaram : సంక్రాంతికి రమణ గాడి జాతర.. మూడు రోజుల్లో గుంటూరు కారం కలెక్షన్స్ ఎన్ని కోట్లు?

ఈ ఫోటోలని వీడియో రూపంలో పవన్ కళ్యాణ్ అన్నవరం సినిమాలోని ‘అన్నయ్య అన్నావంటే..’ సాంగ్ పెట్టి రేణు దేశాయ్ పోస్ట్ చేసింది. దీంతో రేణు దేశాయ్ పోస్ట్ వైరల్ గా మారింది. ఈ ఫొటోల్లో అకిరా కొత్త లుక్ లో కనపడుతున్నాడు. ఇన్నాళ్లు మీసం, గడ్డం లేకుండా పిల్లాడిగా కనపడిన అకిరా ఇప్పుడు ఫుల్ మీసాలు, జుట్టు, గడ్డంతో చాలా పెద్దవాడిగా కనిపిస్తున్నాడు. పవన్ తనయుడి కొత్త లుక్ అదిరిపోయింది అంటున్నారు అభిమానులు. ఇక ఆద్య రెడ్ పంజాబీ డ్రెస్ లో పద్దతిగా రెడీ అయింది. ప్రస్తుతానికి ఈ అన్నాచెల్లెళ్ల ఫొటోలు వైరల్ గా మారాయి.

 

అయితే ఈ ఫొటోలు బెంగుళూరు మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్ నుంచి షేర్ చేశారు. మెగా ఫ్యామిలీ అంతా ఈ సంక్రాంతికి బెంగుళూరు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ అందరూ కలిసి ట్రెడిషినల్ గా పండగని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సెలబ్రేషన్స్ కి అకిరా, ఆద్యలు కూడా వెళ్లడంతో అక్కడ నుంచి ఫొటోలు షేర్ చేశారు.

 

View this post on Instagram

 

A post shared by renu desai (@renuudesai)