BRO Movie : ‘బ్రో’ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ అయ్యింది.. ఎప్పుడు, ఎక్కడో తెలుసా..?
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ బ్రో ఓటీటీకి వచ్చేందుకు టైం ఫిక్స్ చేసుకుంది.

Pawan kalyan Sai Dharam Tej BRO Movie OTT release date details
BRO Movie : పవన్ కళ్యాణ్ (Pawan kalyan), సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) కలయికలో తమిళ్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన సినిమా ‘బ్రో’. ఒరిజినల్ వెర్షన్ డైరెక్ట్ చేసిన సముద్రఖనినే ఈ రీమేక్ ని కూడా తెరకెక్కించాడు. కేతిక శర్మ (Ketika Sharma), ప్రియా వారియర్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, 30 ఇయర్స్ పృథ్వి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా జులై 28న రిలీజ్ అయ్యి మంచి హిట్టుని అందుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద 130 కోట్ల పైగా కలెక్షన్స్ సాధించినట్లు సమాచారం.
రాజకీయ వివాదాల మధ్య థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గానే రన్ అయ్యిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి సిద్దమవుతుంది. ఈ నెల (ఆగస్టు) 25 నుంచి ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో ప్రసారం కానుంది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవ్వనుంది. థియేటర్ లో మామాఅల్లుళ్ళ అల్లరి మిస్ అయిన వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేయండి.
View this post on Instagram
ఇక ఈ మూవీలోని 30 ఇయర్స్ పృథ్వి క్యారెక్టర్ ఏపీ రాజకీయాల్లో వివాదానికి దారి తీసింది. ఆ పాత్ర ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబుని పోలి ఉందంటూ కామెంట్స్ వినిపించడంతో, అంబటి కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నాయకులు, అంబటి మధ్య విమర్శల యుద్ధం జరిగింది. ఇక దీని పై సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ.. “ఆ పాత్ర ఒక పీఆర్ వ్యక్తి క్యారెక్టర్ ను స్ఫూర్తి పొంది చేసింది. అంబటి రాంబాబుకు ఆ పాత్రకి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి రాజకీయాలకు, సినిమాకు ముడిపెట్టకండి” అంటూ పేర్కొన్నాడు.