Pawan kalyan : బిల్ గేట్స్‌తో మీటింగ్ ఉన్నా కూడా వచ్చిన కేటీఆర్ గారికి కృతజ్ఞతలు
భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చినందుకు కేటీఆర్, తలసాని లకు కృతజ్ఞతలు తెలుపుతూ పవన్ కళ్యాణ్ ప్రెస్ నాట్ రిలీజ్ చేశారు. ఈ ప్రెస్ నోట్ లో పవన్ కళ్యాణ్........

Ktr
Bheemla Nayak : పవన్ కళ్యాణ్ రానా కలిసి నటించిన భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి 25 న రిలీజ్ అవ్వనుంది. ఈ సినిమా ప్రై రిలీజ్ ఈవెంట్ బుధవారం ఫిబ్రవరి 23 న హైదరాబాద్ యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి కేటీఆర్, తలసాని శ్రీనివాస యాదవ్ లు ముఖ్య అతిధులుగా వచ్చారు. ఈ కార్యక్రమం పవన్ అభిమానుల మధ్య ఘనంగా జరిగింది. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చినందుకు కేటీఆర్, తలసాని లకు కృతజ్ఞతలు తెలుపుతూ పవన్ కళ్యాణ్ ప్రెస్ నాట్ రిలీజ్ చేశారు.
ఈ ప్రెస్ నోట్ లో పవన్ కళ్యాణ్.. ”కళను అక్కున చేర్చుకొని అభినందించడానికి ప్రాంతీయ, భాష, కుల, మత బేధాలు ఉండవు. అంతే కాదు భావ వైరుధ్యాలు అడ్డంకి కాబోవు. ఈ వాస్తవాన్ని మరోమారు తెలియజెప్పిన తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి నిండు హృదయంతో మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈ రోజు జరిగే బయో ఆసియా అంతర్జాతీయ సదస్సులో బిల్ గేట్స్ తో కీలకమైన వర్చువల్ మీట్ కు సన్నద్ధమవుతూ బిజీగా ఉన్నా సమయం వెసులుబాటు చేసుకొని భీమ్లా నాయక్ ప్రి రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.”
Pawan Kalyan : ‘గాడ్ ఫాదర్’తో ‘భీమ్లా నాయక్’.. ఒకరికోసం ఒకరు
”ఎంత భావ వైరుధ్యాలున్నా, రాజకీయ విమర్శలు చేసుకున్నా వాటిని కళకు, సంస్కృతికి అంటనీయకపోవడం తెలంగాణ రాజకీయ నేతల శైలిలో ఉంది. ప్రస్తుత హరియాణ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు ప్రతి ఏటా నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమంలో అన్ని పక్షాలవారు ఆత్మీయంగా ఉండటాన్ని చూస్తాం. అటువంటి ఆత్మీయత శ్రీ కె.టి.ఆర్. గారిలో ప్రస్పుటంగా కనిపిస్తుంది. సృజనాత్మకత, సాంకేతికతల మేళవింపుతో కొనసాగే సినిమా రంగాన్ని ప్రోత్సహిస్తూ ఈ రంగం అభివృద్ధికి ఆలోచనలను శ్రీ కె.టి.ఆర్. గారు చిత్తశుద్ధితో పంచుకున్నారు.”
Bheemla Nayak: మాస్ కా బాస్.. యాక్షన్ బుల్లెట్లు దింపుతున్న పవర్ స్టార్!
”అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస యాదవ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను” అంటూ కృతజ్ఞతలు తెలిపారు.