Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ‘OG’ సినిమా మొదలు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను స్టార్ట్ చేస్తున్నాడు. ఇటీవల హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాని గ్రాండ్ గా పూజ కార్యక్రమాలతో లాంచ్ చేశాడు. తాజాగా నేడు (జనవరి 30) మరో క్రేజీ ప్రాజెక్ట్ కి కొబ్బరికాయ కొట్టాడు.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ‘OG’ సినిమా మొదలు..

pawn kalyan og

Updated On : January 30, 2023 / 1:32 PM IST

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను స్టార్ట్ చేస్తున్నాడు. ఇటీవల హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాని గ్రాండ్ గా పూజ కార్యక్రమాలతో లాంచ్ చేశాడు. తాజాగా నేడు (జనవరి 30) మరో క్రేజీ ప్రాజెక్ట్ కి కొబ్బరికాయ కొట్టాడు. RRR నిర్మాత డివివి దానయ్య నిర్మాణంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయబోతున్నట్లు ఆ నిర్మాణ సంస్థ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈరోజు ఈ మూవీని అఫీషియల్ గా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ఈ ఈవెంట్ కి నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబుతో పాటు ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

Pawan Kalyan: పవన్-సుజిత్ సినిమాలో అవేమీ ఉండవా.. అభిమానులు ఒప్పుకుంటారా..?

సాహో ఫేమ్ సుజిత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. సుజిత్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. సాహో అనుకున్నంత హిట్ అవ్వకపోయినా, మూవీలోని యాక్షన్ సీక్వెన్స్ అండ్ హీరో క్యారక్టరైజేషన్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. నిర్మాత డివివి కూడా ఆర్ఆర్ఆర్ వంటి సక్సెస్ తో ఉండడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ‘ది కాల్ హిమ్ OG’ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ మొదలైంది. టైటిల్ బట్టి చూస్తే పవన్ కళ్యాణ్.. పంజా మూవీ తరహా రోల్ లో కనిపించబోతున్నాడు అని తెలుస్తుంది.

ఇటీవల దర్శకులు గోపీచంద్ మలినేని, బాబీ తమ అభిమాన హీరోలను వింటేజ్ వెర్షన్ లో చూపించి అభిమానులను ఖుషి చేశారు. ఇప్పుడు పవన్ కి వీరాభిమాని అయిన సుజిత్ కూడా పవన్ ని వింటేజ్ వెర్షన్ లో చూపించబోతున్నాడని సంబర పడుతున్నారు. కాగా భీమ్లా నాయక్ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన రవి కె చంద్రన్ ఈ చిత్రానికి పని చేస్తున్నాడు. ఎస్ ఎస్ థమన్ మరోసారి పవన్ కళ్యాణ్ సినిమాకి సంగీతం అందించబోతున్నాడు. ఇక ఇవాళ జరిగిన సినిమా ఓపెనింగ్ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.