Pawan Kalyan : ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత.. రీ రిలీజ్ అవుతున్న పవన్ కళ్యాణ్ సినిమా..

పవన్ అభిమానులకు మరో గుడ్ న్యూస్ తెలిపారు.

Pawan Kalyan : ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత.. రీ రిలీజ్ అవుతున్న పవన్ కళ్యాణ్ సినిమా..

Pawan Kalyan Super Hit Movie Badri Re Releasing after Pawan Winning as MLA

Updated On : June 6, 2024 / 10:54 AM IST

Pawan Kalyan : ఇటీవల పాత సినిమాలు రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోల హిట్ సినిమాలతో పాటు కొన్ని మంచి సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా గతంలో ఖుషి, వకీల్ సాబ్, బద్రి.. ఇలా పలు విసినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు పవన్ మరో సినిమా రీ రిలీజ్ కాబోతుంది.

తాజాగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచాడు. పవన్ ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు, జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలవడంతో పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఫుల్ సంతోషంలో ఉన్నారు. ఈ సంతోషాన్ని రెట్టింపు చేస్తూ పవన్ అభిమానులకు మరో గుడ్ న్యూస్ తెలిపారు.

Also Read : Pawan Kalyan : ఎమ్మెల్యేగా నా జీతం మొత్తం తీసుకుంటాను.. ఎందుకంటే.. పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఇప్పుడు పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమా రీ రిలీజ్ చేయబోతున్నారు. తమ్ముడు సినిమా 15 జులై 1999 లో రిలీజయి భారీ విజయం సాధించింది. ఈ సినిమా రిలీజయి 25 ఏళ్ళు అవుతుండటంతో మళ్ళీ అదే డేట్ కి తమ్ముడు సినిమా రీ రిలీజ్ చేస్తున్నారు. దీంతో పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, ప్రీతీ జింగానియ జంటగా అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఒక అన్నయ్య కోరిక నెరవేర్చడానికి అల్లరిచిల్లరగా తిరిగే తమ్ముడు ఎలా కష్టపడ్డాడు అనే కథాంశంతో తెరకెక్కి భారీ హిట్ కొట్టింది. ఇక ఈ సినిమా సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే. పవన్ అభిమానులు థియేటర్స్ లో మరోసారి తమ్ముడు కోసం సందడి చేయనున్నారు.