షూటింగ్‌కి పవన్ గ్రీన్ సిగ్నల్! ‘వకీల్ సాబ్’ వచ్చేది ఎప్పుడంటే..

  • Published By: sekhar ,Published On : September 14, 2020 / 01:57 PM IST
షూటింగ్‌కి పవన్ గ్రీన్ సిగ్నల్! ‘వకీల్ సాబ్’ వచ్చేది ఎప్పుడంటే..

Updated On : September 14, 2020 / 2:33 PM IST

Pawan Kalyan’s Vakeel Saab Update: లాక్‌డౌన్ కారణంగా ఇన్నాళ్లూ ఇళ్లకే పరిమితమైన స్టార్స్ ఒక్కొక్కరిగా ముఖానికి మేకప్ వేసుకుంటున్నారు. త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా త్వరలో ‘వకీల్ సాబ్’ షూటింగులో పాల్గొన్నబోతున్నారట. 2021 సంక్రాంతికి సందడి చేయడానికి రెడీ కావాలనుకుంటున్న పవర్ స్టార్ వకీల్ సాబ్ షూట్ ఈ నెల 23 నుంచి సెట్స్ మీదకు వెళ్లబోతున్నట్లు సమాచారం. సుమారుగా నెలరోజుల షూటింగ్ బ్యాలెన్స్ వుందని ఇందులో పవన్ వర్క్ 15 రోజులు మాత్రమే వుంటుందని తెలుస్తోంది.



https://10tv.in/the-blockbuster-combo-is-back-concept-poster-of-pspk28/
మిగతా నటీనటుల డేట్స్ వంటివి దృష్టిలో పెట్టుకుని మొదట పవన్ పోర్షన్ కంప్లీట్ చేయడమా.. లేక సింగిల్ షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేసేద్దామా?.. అని దర్శక నిర్మాతలు ఆలోచించి ఓ క్లారిటీతో పవన్‌ను సంప్రదించడం.. ‘కరోనాకు వ్యాక్సిన్ వచ్చే వరకు షూటింగులో పాల్గొనకపోవడం మంచిది’ అని ఇటీవల చెప్పిన పవన్ ఇప్పుడు నిర్మాతల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని షూటింగ్‌కు డేట్స్ ఇవ్వడం కూడా జరిగిపోయిందని ఫిల్మ్‌‌నగర్ టాక్.


ఒకవేళ ప్లాన్ ప్రకారం అక్టోబర్ చివరి నాటికి సినిమాను పూర్తి చేయగలిగితే క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25నాడు లేదా కాస్త అటు ఇటు అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి ‘వకీల్ సాబ్’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. మెసేజ్‌తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్‌ను కూడా సమానంగా చూపించనున్నామని, పవర్‌స్టార్‌కు ‘వకీల్ సాబ్’ పర్ఫెక్ట్ రీ ఎంట్రీ చిత్రం అవుతోందని నిర్మాతలు ధీమాగా చెబుతున్నారు.