Pawan Kalyan : విశ్వక్ సేన్ సినిమాకి క్లాప్ కొట్టిన పవన్ కళ్యాణ్..

వరుస హిట్స్ తో మంచి జోష్ మీద ఉన్నాడు యువ హీరో విశ్వక్ సేన్. ఇటీవలే అశోకవనంలో అర్జున్ కళ్యాణం సినిమాతో వచ్చి హిట్ కొట్టాడు. అటు మాస్, ఇటు క్లాస్ సినిమాలతో మెప్పిస్తున్నాడు.....

Pawan Kalyan : విశ్వక్ సేన్ సినిమాకి క్లాప్ కొట్టిన పవన్ కళ్యాణ్..

Pawan Kalyan

Updated On : June 23, 2022 / 12:05 PM IST

Pawan Kalyan :  వరుస హిట్స్ తో మంచి జోష్ మీద ఉన్నాడు యువ హీరో విశ్వక్ సేన్. ఇటీవలే అశోకవనంలో అర్జున్ కళ్యాణం సినిమాతో వచ్చి హిట్ కొట్టాడు. అటు మాస్, ఇటు క్లాస్ సినిమాలతో మెప్పిస్తున్నాడు. ఇటీవలే విశ్వక్ తన నెక్స్ట్ సినిమాని కూడా అనౌన్స్ చేశాడు. యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకుడిగా, ఆయన కూతురు ఐశ్వర్య హీరోయిన్ గా విశ్వక్ హీరోగా ఓ సినిమాని ప్రకటించారు. దీనికి నిర్మాత కూడా అర్జున్ కావడం విశేషం.

Kiyara Advani : వేరే హీరోయిన్స్ తో పోల్చినా మంచిదే అంటున్న కియారా..

తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను రామానాయుడు స్టూడియోస్ లో నిర్వహించారు. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ప్రకాష్ రాజ్, మంచు విష్ణుతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా విచ్చేసారు. హీరో విశ్వక్, హీరోయిన్ ఐశ్వర్య మీద పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కి ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఈ సినిమాకి ‘కేజీఎఫ్’ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ చిన్న హీరోల సినిమా ఫంక్షన్లు, చిత్ర కార్యక్రమాలకు హాజరవుతూ సపోర్ట్ చేస్తున్నారు.