Mangalavaram : మరోసారి RX 100 డైరెక్టర్, హీరోయిన్ కాంబో.. ఫస్ట్ లుక్ రిలీజ్.. ఈ సారి న్యూడ్ గా పాయాల్..

డైరెక్టర్ అజయ్ భూపతి మాత్రం RX 100 తర్వాత చాలా గ్యాప్ తీసుకొని మహాసముద్రం అనే సినిమాతో వచ్చాడు. కానీ ఆ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. ఇప్పుడు 'మంగళవారం' అనే మరో సినిమాతో అజయ్ రాబోతున్నాడు

Mangalavaram : మరోసారి RX 100 డైరెక్టర్, హీరోయిన్ కాంబో.. ఫస్ట్ లుక్ రిలీజ్.. ఈ సారి న్యూడ్ గా పాయాల్..

Payal Rajput first look released from Mangalavaram movie

Updated On : April 25, 2023 / 10:58 AM IST

Mangalavaram : డైరెక్టర్ అజయ్ భూపతి(Ajay Bhupathi) తెలుగులో RX100 సినిమాతో వచ్చి ప్రేక్షకులని మెప్పించాడు. కార్తికేయ(Karthikeya), పాయల్ రాజ్‌పుత్(Payal Rajput) జంటగా వచ్చిన RX100 చిన్న సినిమాగా రిలీజయి భారీ విజయం అందుకుంది. ఈ సినిమాతోనే పాయల్ తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో పాయల్ కొంచెం బోల్డ్ గానే నటించింది. పాయల్ కి ఈ సినిమా బాగా పేరు తీసుకురావడంతో తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చాయి.

డైరెక్టర్ అజయ్ భూపతి మాత్రం RX 100 తర్వాత చాలా గ్యాప్ తీసుకొని మహాసముద్రం అనే సినిమాతో వచ్చాడు. కానీ ఆ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. ఇప్పుడు ‘మంగళవారం’ అనే మరో సినిమాతో అజయ్ రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ నటిస్తుందని ప్రకటించి నేడు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ లో పాయల్ న్యూడ్ గా ఉండి వెనక్కు తిరిగి చూస్తుంది. దీంతో ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

Aditi Rao Hydari : హిందీ వర్సెస్ సౌత్.. పనికిమాలిన చర్చలు అంటున్న అదితి..

మరోసారి RX100 సినిమా డైరెక్టర్, హీరోయిన్ కాంబో అవ్వడం, ఫస్ట్ లుక్ లోనే పాయల్ ఇలా న్యూడ్ గా కనిపించడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో పాయల్ శైలజ అనే క్యారెక్టర్ లో నటిస్తుంది. సరికొత్త కథతో ఈ సినిమా సౌత్ లోని నాలుగు భాషల్లో రాబోతుంది. ఇక ఈ సినిమాకు కాంతార మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు. అజనీష్ ఇటీవలే విరూపాక్ష సినిమాకు సంగీతం అందించగా సినిమా భారీ హిట్ అయింది. మ్యూజిక్ కి మంచి పేరు వచ్చింది. మరి అజయ్ తనకు కలిసొచ్చిన హీరోయిన్ పాయల్ తో మరోసారి హిట్ కొడతాడేమో చూడాలి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.