Payal Rohatgi: కంగనా సినిమాలన్నీ అట్టర్ ప్లాప్ కావాలి.. నటి శాపం!

కంగనా రనౌత్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదనుకుంటా. గత కొంత కాలంలో బాలీవుడ్ సెలబ్రిటీల నుండి పోలీటీషియన్ల వరకు అందరినీ ఏకిపారేస్తూ సంచలన కామెంట్స్ చేస్తూ ఫైర్ బ్రాండ్ గా ముద్ర వేసుకుంది.

Payal Rohatgi: కంగనా సినిమాలన్నీ అట్టర్ ప్లాప్ కావాలి.. నటి శాపం!

Payal Rohatgi

Updated On : May 18, 2022 / 4:29 PM IST

Payal Rohatgi: కంగనా రనౌత్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదనుకుంటా. గత కొంత కాలంలో బాలీవుడ్ సెలబ్రిటీల నుండి పోలీటీషియన్ల వరకు అందరినీ ఏకిపారేస్తూ సంచలన కామెంట్స్ చేస్తూ ఫైర్ బ్రాండ్ గా ముద్ర వేసుకుంది. కంగనా.. బాలీవుడ్ లో వారసుల నుండి స్టార్ హీరోలు, దర్శకుల వరకు ఎవరినీ వదలకుండా విమర్శలు చేసే కంగనాకు శత్రువులు కూడా అదే స్థాయిలో ఉన్నారు. అందులో ఓ నటి ఇప్పుడు కంగనాకు శాపాలు పెడుతూ తన ఆక్రోశాన్ని వెళ్లగక్కింది. కంగనా సోషల్ మీడియా అకౌంట్లను కూడా అన్ ఫాలో చేస్తున్నట్లుగా ప్రకటించిన నటి సోషల్ మీడియాలో కంగనాపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

Kangana Ranaut : ఆ స్టార్ కిడ్స్ ఉడకబెట్టిన కోడిగుడ్లలా ఉంటారు.. మరోసారి బాలీవుడ్ పై కంగనా విమర్శలు..

లాకప్ అనే షోకు కంగనా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో విన్నర్‌గా నటుడు మునావర్‌ ఫరూఖీ నిలవగా.. నటి పాయల్‌ రోహత్గీ రన్నర్‌గా నిలిచింది. నిజానికి పాయల్‌ ఈ షో విన్నర్‌ అవుతుందని మొదటి నుంచి ప్రచారం జరగగా.. చివరకు తమె రన్నర్‌గా నిలిచి మునావర్ విన్నర్ అయ్యాడు. అయితే దీన్ని పాయల్‌ జీర్ణించుకోలేకపోతోంది. ఈ షో టీం, హోస్ట్‌ కంగనాపై సోషల్‌ మీడియా వేదికగా పాయల్ తీవ్ర విమర్శలకు దిగింది. లాకప్‌ గేమ్‌లో భాగంగా ‘పాయల్‌ ఈ ఎపిక్‌ టెస్ట్‌ పాసవుతుందా?’ అనే గతం పోస్ట్‌ను ఆమె రీషేర్‌ చేస్తూ తన అసహనాన్ని బయటపెట్టింది.

Kangana Ranaut: మంచు విష్ణుకి కంగనా థాంక్స్.. ఎందుకంటే?

ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ షేర్‌ చేస్తూ.. ‘నిజానికి ఆట ఆడకుండా, కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న వ్యక్తి విన్నర్‌ అవ్వడమే ఈ లాకప్‌ షో థీమ్‌ అనుకుంట. అలాంటి వారి కోస​మే ఈ షోను పెట్టారు. అయితే లాకప్‌ ఫైనల్‌ ఎపిసోడ్‌ జరిగే వారానికి ముందు కంగనా అర్పిత ఖాన్‌(సల్మాన్‌ ఖాన్‌ సోదరి) ఈద్‌ పార్టీలో పాల్గొన్న కంగనాకు బిగ్‌బాస్‌ హోస్ట్‌ సల్మాన్‌తో మంచి పరిచయం ఏర్పడింది. అప్పుడే తాను లాకప్‌ విన్నర్‌ ఎవరనేది నిర్ణయించుకుంది. అందుకే వారికి సంబంధించిన వారినే లాకప్‌ షో విన్నర్‌గా ప్రకటించుకున్నారు’ అంటూ రాసుకొచ్చింది.

Kangana Ranaut : ఆ స్టార్ హీరోలు నా సినిమాని ప్రమోట్ చేయరు.. నాకు ఎక్కువ పేరు వస్తుందని ఫీల్ అవుతారు..

అంతేకాదు.. ‘పెళ్లై పిల్లలు ఉన్న అతడు షోలో మరో అమ్మాయితో రొమాన్స్‌ చేశాడు. అంతేకాదు అతడు మిగతా ప్లేయర్స్‌ను కూడా మెంటల్‌గా అటాక్‌ చేశాడు. ఇక ఆ పనిపాట లేని సెలబ్రెటీలు ఇది చూసి నిజం అనుకున్నారు. ఇది వారికి వినోదంగా అనిపించేందోమో​. కానీ వారందరిని చూస్తుంటే నాకిప్పుడు బాధేస్తోంది’ అంటూ వ్యాఖ్యలు చేసిన పాయల్‌.. ఈ షో హాస్ట్‌, నటి కంగనాను సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేస్తున్నట్లు తెలిపి, కంగనా సినిమాలన్ని ఫ్లాప్‌ అవ్వాలని కోరుకుంటున్నానంటూ శాపాలు కూడా పెట్టింది.

 

View this post on Instagram

 

A post shared by Team Payal Rohatgi (@payalrohatgi)