Pedro Pascal : మార్వెల్ సినిమా.. 1960 అమెరికన్ యాస కోసం పెడ్రో పాస్కల్ కష్టం..
తాజాగా ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ మెయిన్ లీడ్ పెడ్రో పాస్కల్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు.

Pedro Pascal
Pedro Pascal : మార్వెల్ స్టూడియోస్ నుంచి మాట్ షాక్‌మాన్ దర్శకత్వంలో కెవిన్ ఫీజ్ నిర్మాణంలో ‘ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్’ సినిమా జూలై 25న రాబోతుంది. ఇది మార్వెల్ మొదటి సూపర్ హీరో కుటుంబానికి, గ్రహాలను మింగేసే గెలాక్టస్‌కి మధ్య జరగబోయే పోరాట కథతో రానుంది. ఇండియాలో తెలుగు, తమిళ్, హిందీలో కూడా ఈ సినిమా విడుదల కానుంది.
తాజాగా ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ మెయిన్ లీడ్ పెడ్రో పాస్కల్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. పెడ్రో పాస్కల్ ఈ సినిమాలో మిస్టర్ ఫెంటాస్టిక్ / రీడ్ రిచర్డ్స్ గా కనపడబోతున్నాడు.
Also Read : HariHara VeeraMallu : ఆ వార్తలను ఖండించిన ‘హరిహర వీరమల్లు’ మూవీ యూనిట్.. ఇది ఎవరి జీవిత కథ కాదు..
పెడ్రో పాస్కల్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం 1960 లోని యాస మాట్లాడటానికి 100 శాతం నా బెస్ట్ ఇచ్చాను. నేను బాగా చేశానో లేదో నాకు తెలియదు కానీ సినిమా సిబ్బంది మిడ్-అట్లాంటిక్, 60ల ప్రారంభంలోని యాస నుంచి నన్ను వెనక్కి లాగుతూనే ఉన్నారు. ఆ రకమైన మాండలికం కోసం మాకు సహాయం చేయడానికి ఒక కోచ్ కూడా ఉన్నారు. నేను బాగా నేర్చుకున్నాను. కానీ మూవీ సిబ్బంది మీలాగే మాట్లాడండి అన్నారు. నేను ఆ యుగంలోకి వెళ్లినందుకు అలా చేయడం కోసం కష్టపడ్డాను, ఈ సినిమా ఇంతకు ముందు చూసిన దానికంటే భిన్నంగా ఉంటుంది. ఇందులో సృష్టించింది ఇప్పటివరకు మనం చూడలేదు అని తెలిపారు.
Also Read : RK Sagar : ‘రంగస్థలం’లో ఆ పాత్రకు మొగలిరేకులు హీరోని అడిగారట.. ఒప్పుకున్నా కూడా..