Pooja Hegde : పూజాహెగ్డే అన్ని కోట్లు పెట్టి ముంబైలో ఇల్లు కొందా? స్టార్ హీరోలు కూడా అంత ఖర్చుపెట్టరేమో..

పూజాహెగ్డేకు ముంబైలో ఆల్రెడీ ఓ అపార్ట్మెంట్ ఉంది. తాజాగా పూజాహెగ్డే ముంబై బాంద్రాలో ఇల్లు కొనుక్కుందని సమాచారం.

Pooja Hegde : పూజాహెగ్డే అన్ని కోట్లు పెట్టి ముంబైలో ఇల్లు కొందా? స్టార్ హీరోలు కూడా అంత ఖర్చుపెట్టరేమో..

Pooja Hegde Buys Costly House in Mumbai Bandra Rumours goes Viral

Pooja Hegde : పూజాహెగ్డే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి సడెన్ గా ఇక్కడ స్టార్ హీరోల సినిమాలు వదిలేసుకొని మరీ బాలీవుడ్ కి చెక్కేసింది. అక్కడ వచ్చిన సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఎక్కువగా ఆఫర్స్ రావట్లేదు. ఇటు సౌత్ లో కూడా ఆఫర్స్ రావట్లేదు. ప్రస్తుతానికి పూజాహెగ్డే చేతిలో రెండు బాలీవుడ్ సినిమాలు ఉన్నట్టు సమాచారం. తాజాగా పూజాహెగ్డే బాలీవుడ్ లో వైరల్ అవుతుంది.

సినిమా స్టార్ సెలబ్రిటీలు అంతా ముంబై బాంద్రాలో ఉంటారు. అక్కడ అన్నీ ఖరీదే. కోట్లు కోట్లు ఖర్చుపెట్టి మరీ బాంద్రాలో బాలీవుడ్ సెలబ్రిటీలు ఇళ్ళు కొనుక్కుంటారు. బాంద్రాలో ఇల్లు ఉండటం ఓ స్టేటస్ గా భావిస్తారు సెలబ్రిటీలు. పూజాహెగ్డేకు ముంబైలో ఆల్రెడీ ఓ అపార్ట్మెంట్ ఉంది. తాజాగా పూజాహెగ్డే కూడా బాంద్రాలో ఇల్లు కొనుక్కుందని సమాచారం. సముద్రం ఫేసింగ్ ఉండేలా బాంద్రాలో పూజాహెగ్డే దాదాపు 45 కోట్లు ఖర్చుపెట్టి ఓ ఇల్లు కొనుక్కుందని సమాచారం.

Also Read : Vijay – Vishal : విజయ్ వర్సెస్ విశాల్..? ఆసక్తిగా మారనున్న 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు..

అంతేకాకుండా ఆ ఇంటికి మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు పెట్టి తనకు కావలసినట్టు డిజైన్ చేయించుకుంటుంది పూజాహెగ్డే. బాంద్రాలో వందల కోట్ల ఖరీదైన ఇళ్లు కూడా ఉన్నాయి. ఒక హీరోయిన్ చేతిలో పెద్దగా ఆఫర్స్ లేకపోయినా 45 కోట్లు పెట్టి ముంబై బాంద్రాలో ఇల్లు కొనడంతో పూజాహెగ్డే ప్రస్తుతం బాలీవుడ్ లో చర్చగా మరింది. మన టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం అంత ఖర్చుపెట్టి కొనరేమో అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మరి ముంబైలో ఉండటానికి ఫిక్స్ అయిపోయిన ఈ బుట్టబొమ్మకి బాలీవుడ్ లో ఇంకా ఛాన్సులు వస్తాయేమో చూడాలి.