Vijay – Vishal : విజయ్ వర్సెస్ విశాల్..? ఆసక్తిగా మారనున్న 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు..

తాజాగా ఓ ప్రెస్ మీట్ లో విశాల్ మాట్లాడుతూ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Vijay – Vishal : విజయ్ వర్సెస్ విశాల్..? ఆసక్తిగా మారనున్న 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు..

Vishal wants to compete in Tamilnadu assembly Elections Vijay Vs Vishal will Happen in 2026

Updated On : April 15, 2024 / 7:28 AM IST

Vijay – Vishal : తమిళనాడులో గత కొన్నేళ్లుగా రెండు పార్టీలే అధికారాన్ని పంచుకుంటున్నాయి. జాతీయ పార్టీలు ఆ రెండు పార్టీలతో పొత్తుతో వెళ్తున్నాయి. ఈ మధ్యలో చాలా మంది పార్టీలు పెట్టినా అంతగా ప్రభావం చూపించలేకపోయారు. తమిళనాడులో సినిమా స్టార్లే ఎక్కువగా రాజకీయాల్లోకి వస్తారు. ఇటీవల తమిళ్ స్టార్ హీరో విజయ్ అధికారికంగా పార్టీ ప్రకటించి 2026 ఎన్నికల లక్ష్యంగా పోటీ చేస్తానని తెలిపాడు. దీంతో 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది.

ఇప్పటికే రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తానని చెప్పి మళ్ళీ ఆగిపోయారు. ఇక కమల్ హాసన్ గతంలో ఎప్పుడో పార్టీ పెట్టినా ప్రస్తుతం స్టాలిన్ కి సపోర్ట్ ఇచ్చారు. త్వరలో లోక్ సభ ఎన్నికలు జరుగుతుండగా చాలా మంది సినీ స్టార్లు ఆయా పార్టీలకు సపోర్ట్ చేస్తున్నారు. కొంతమంది పోటీ చేస్తున్నారు. తాజాగా విశాల్ కూడా పార్టీ పెడతారని వార్తలు వస్తున్నాయి.

తెలుగబ్బాయి విశాల్ తమిళ్ లో స్టార్ హీరోగా సినిమాలు చేస్తున్నారు. ఇక్కడ కూడా విశాల్ సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. విశాల్ రాజకీయాల్లోకి వస్తానని గతంలోనే ప్రకటించాడు. గతంలో పోటీకి నామినేషన్ వేసినా రిజెక్ట్ అయింది. ఇటీవల విజయ్ పార్టీ పెట్టాక అతన్ని కలవడంతో విజయ్ పార్టీ నుంచి పోటీ చేస్తాడని అంతా అనుకున్నారు. తాజాగా ఓ ప్రెస్ మీట్ లో విశాల్ మాట్లాడుతూ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Also Read : Game Changer : ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్ అప్డేట్ ఇచ్చిన రామ్ చరణ్..

విశాల్ మాట్లాడుతూ.. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పోటీచేస్తాను. అయితే ఏదైనా పార్టీలో చేరుతానా? లేక కొత్త పార్టీ పెడతానా అనేది అప్పుడు ఆలోచిస్తాను. ప్రస్తుతానికి అయితే ఒంటరిగానే పోటీ చేయాలనుకుంటున్నాను. నా సత్తా ఏంటో చూపించాలని అనుకుంటున్నాను. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే జాబితాలో నా పేరు ఉంటుంది. తమిళనాడు ప్రజలకు సరైన సౌకర్యాలు లేవు, ఆ సౌకర్యాలు ఏర్పాటు చేయడానికే రాజకీయాల్లోకి వస్తానని తెలిపాడు. దీంతో విశాల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ఇన్నాళ్లు విజయ్ కి సపోర్ట్ ఇస్తాడనుకున్న విశాల్ ఇప్పుడు ఒంటరిగా పోటీచేస్తానని చెప్పడంతో వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ వర్సెస్ విశాల్ అవుతుందా అని చర్చించుకుంటున్నారు. ఈ సారి రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం సినిమా సినిమా స్టార్స్ హంగామానే ఎక్కువగా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది.

Also Read : Salman Khan : సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద తుపాకుల అలజడి.. ఏం జరిగింది..?