Bigg Boss 7 : పూజా మూర్తికి షాకింగ్ రెమ్యునరేషన్..?.. రెండు వారాలకు ఎంత సంపాదించిందో తెలుసా..?
బిగ్‌బాస్ సీజన్ 7లో ఏడు వారాలు పూర్తి అయ్యాయి. ఏడుగురు ఎలిమినేట్ అయ్యారు.

Pooja Murthy
Bigg Boss 7 Telugu : బిగ్‌బాస్ సీజన్ 7లో ఏడు వారాలు పూర్తి అయ్యాయి. ఏడుగురు ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారంలో కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, మూడో వారంలో దామిని, నాలుగో వారంలో రతికా రోజ్, ఐదో వారంలో శుభ శ్రీ, ఆరో వారంలో నయని లు హౌస్ నుంచి వెళ్లిపోగా.. తాజాగా పూజా మూర్తి ఎలిమినేట్ అయ్యింది. బిగ్‌బాస్ చరిత్రలో ఇది ఓ రికార్డుగా నిలిచిపోతుంది. ఒక సీజన్‌లో వరుసగా ఏడు వారాల్లో ఏడుగురు మహిళా కంటెస్టెంట్లు ఎలిమినేట్ కావడం ఇదే తొలిసారి. ఇక ఎలిమినేట్ అయిన ఏడుగురిలో రతిక రీ ఎంట్రీ ఇచ్చింది.
పూజా మూర్తికి ఓట్లు తక్కువగా వచ్చాయన్న కారణంతో బిగ్‌బాస్ ఆమెను ఎలిమినేట్ చేశారు. వాస్తవానికి పూజా బిగ్‌బాస్ ఆరంభంలోనే హౌస్‌లోకి అడుగుపెట్టాల్సి ఉంది. షో ప్రారంభానికి ముందు సడెన్‌గా ఆమె తండ్రి మరణించడంతో హౌస్‌లోకి వెళ్లలేదు. వైల్డ్ కార్డు ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టింది. అయితే.. వచ్చి రావడంతోనే అశ్వినితో గొడవకు దిగింది. ఆటలో కూడా తన మార్క్‌ను చూపించలేకపోయింది. ప్రేక్షకుల ఓట్లను పొందలేకపోయింది.
Bigg Boss 7 : నామినేషన్స్ హీట్ మొదలైంది.. శోభా వర్సెస్ శివాజీ, ప్రియాంక వర్సెస్ బోలే
ఓవరాల్‌గా బిగ్‌బాస్‌లో రెండు వారాలు మాత్రమే ఉంది. వారానికి రూ.1.5లక్షల చొప్పున ఆమె అగ్రిమెంట్ చేసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఈ లెక్కన ఆమె రెండు వారాలకు రూ.3లక్షలు అందుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటి వరకు బిగ్‌బాస్‌లో అతి తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న కంటెస్టెంట్‌గా పూజా మూర్తి నిలిచిందని అంటున్నారు. మొత్తానికి చెప్పినట్లుగానే ఈ సీజన్ ఉల్టా ఫుల్టాగానే జరుగుతోంది.