పవన్ కళ్యాణ్ OG రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎలక్షన్స్ అయ్యాకే సినిమా విడుదల

తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ ఇదే డేట్ ని అధికారికంగా ప్రకటిస్తూ పవన్ కళ్యాణ్ ఉన్న ఓ కొత్త పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు.

పవన్ కళ్యాణ్ OG రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎలక్షన్స్ అయ్యాకే సినిమా విడుదల

Power Star Pawan Kalyan They Call Him OG Movie Release Date Officially Announced

Updated On : February 6, 2024 / 5:33 PM IST

They Call Him OG :  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Power Star Pawan Kalyan) ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమా ‘They Call Him OG’. సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో DVV ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో గ్యాంగ్‌స్ట‌ర్స్‌ నేపథ్యంతో OG సినిమా తెరకెక్కుతుంది. బాలు, పంజా సినిమాల తరువాత పవన్ నుంచి మళ్ళీ అలాంటి ఓ గ్యాంగ్‌స్ట‌ర్ మూవీ వస్తుండటంతో, ఇప్పటికే ఇచ్చిన అప్డేట్స్, పవన్ లుక్స్, గ్లింప్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఏపీ ఎలక్షన్స్ ముందే పవన్ ఈ సినిమాని రిలీజ్ చేస్తారనుకున్నారు. కానీ ఇటీవల OG సినిమా సెప్టెంబర్ 27 రిలీజవుతుందని వార్తలు వచ్చాయి. తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ ఇదే డేట్ ని అధికారికంగా ప్రకటిస్తూ పవన్ కళ్యాణ్ ఉన్న ఓ కొత్త పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్ లో పవన్ స్టైలిష్ గా బ్లాక్ డ్రెస్‌లో బ్లాక్ కళ్ళజోడు పెట్టుకొని బ్లాక్ కారుకి ఆనుకొని చేతిలో టీ గ్లాస్‌తో నిల్చున్నాడు. మొత్తానికి పవన్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న ‘They Call Him OG’ సినిమా సెప్టెంబర్ 27 థియేటర్స్ సందడి చేయబోతుంది..

Also Read : రష్మిక రెమ్యునరేషన్స్ పై వస్తున్న వార్తలకు.. కౌంటర్ ఇచ్చిన రష్మిక..

ఇదే డేట్ కి పదేళ్ల క్రితం 2013 లో అత్తారింటికి దారేది సినిమా రిలీజయ్యి అప్పటికి ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా నిలిచింది. దీంతో OG సినిమా మళ్ళీ అదే డేట్ కి వస్తుండటంతో ఈ సినిమా కూడా సరికొత్త రికార్డులు సెట్ చేస్తుందని అంతా భావిస్తున్నారు. ఇక తాజాగా రిలీజ్ చేసిన పవన్ పోస్టర్ వైరల్ గా మారింది.