Adipurush : ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్‌లో పఠాన్ రికార్డుని బ్రేక్ చేసిన ఆదిపురుష్.. ప్రభాస్ రేంజ్ అంటున్న ఫ్యాన్స్!

ప్రభాస్ ఆదిపురుష్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ తో షారుఖ్ ఖాన్ పఠాన్ మొదటి వీకెండ్ కలెక్షన్స్ ని అలవోకగా బ్రేక్ చేసేశాడు.

Adipurush : ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్‌లో పఠాన్ రికార్డుని బ్రేక్ చేసిన ఆదిపురుష్.. ప్రభాస్ రేంజ్ అంటున్న ఫ్యాన్స్!

Prabhas Adipurush Collections crossed Shah Rukh Khan Pathaan collections

Updated On : June 19, 2023 / 2:31 PM IST

Prabhas Adipurush : బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్ లో ప్ర‌భాస్‌ రాముడిగా, కృతి స‌న‌న్ (Kriti Sanon) సీత‌గా, సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) రావణాసురుడిగా కనిపిస్తూ ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా ఆదిపురుష్‌. జూన్ 16న భారీ అంచనాలు మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రేక్షకులను నిరాశపరిచింది. అంతేకాకుండా ట్రోలింగ్స్, విమర్శలు, నిషేధాలు కూడా ఎదురుకుంటుంది. అయినాసరి ఈ మూవీ కలెక్షన్స్ జోరు మాత్రం అసలు తగ్గడం లేదు.

Tamil Movies : ఆ 5గురు హీరోలపై తమిళ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సీరియస్ యాక్షన్.. ఇకపై వాళ్ళతో సినిమాలు..

మొదటిరోజే ఈ సినిమా 140 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకొని సంచలనం సృష్టించింది. రెండు రోజు కూడా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టింది. ఇక మొదటి వీకెండ్ పూర్తి అయ్యేపాటికీ మూడు రోజు కూడా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకొని.. మొత్తంగా 340 పైగా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకొని రికార్డు క్రియేట్ చేసింది. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన పఠాన్ సినిమా మొదటి వీకెండ్ పూర్తి అయ్యేసరికి 313 కోట్ల గ్రాస్ రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఆ రికార్డుని ప్రభాస్ ఆదిపురుష్ బ్రేక్ చేసేసింది.

Pawan Kalyan : జనసేనాని వారాహి యాత్ర.. పవన్ కళ్యాణ్ షెడ్యూల్ లో మార్పులు

సినిమా పై భారీ ట్రోలింగ్ అండ్ విమర్శలు వస్తున్నప్పటికీ మూవీ ఈ రేంజ్ కలెక్షన్స్ అందుకోవడం, ఇండియాలోనే పెద్ద స్టార్ అయిన షారుఖ్ మూవీ కలెక్షన్స్ ని కూడా బ్రేక్ చేయడంతో.. అది ప్రభాస్ రేంజ్ అంటూ రెబల్ అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. అలాగే మొదటిరోజు కలెక్షన్స్ తో కూడా ప్రభాస్ సరికొత్త రికార్డుని సృష్టించిన సంగతి తెలిసిందే. బాహుబలి 2, సాహూ, ఆదిపురుష్ సినిమాలతో.. మూడు 100 కోట్ల మార్క్ క్రాస్ చేసిన ఏకైన ఇండియన్ హీరోగా ప్రభాస్ సంచలనం సృష్టించాడు.