Prabhas : ప్రభాస్, సిద్దార్థ్ ఆనంద్ సినిమాని కన్ఫర్మ్ చేసిన మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు..
మైత్రి నిర్మాతలు ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతూ దూసుకుపోతున్నారు. ఇదే విషయాన్ని షోలో బాలకృష్ణ ప్రస్తావిస్తూ బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నారని విన్నాం అని అడగగా మైత్రి నిర్మాతలు నవీన్, రవిశంకర్ మాట్లాడుతూ................

Prabhas and Siddarth Aanand Movie Confirmed by Mythri movie makers Producers
Prabhas : బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో అన్‌స్టాపబుల్ షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ప్రస్తుతం సీజన్ 2 ఆహా ఓటీటీలో సాగుతుండగా ఇటీవలే ప్రభాస్, గోపీచంద్ తో కలిసి బాహుబలి ఎపిసోడ్స్ అంటూ రెండు ఎపిసోడ్స్ ని స్ట్రీమ్ చేయగా వీటికి బాగా రెస్పాండ్ వచ్చింది. ఇక ఇప్పటికే పలు ఎపిసోడ్స్ తో బాలకృష్ణ అలరించగా తాజాగా వీరసింహారెడ్డి చిత్రయూనిట్ అన్‌స్టాపబుల్ షోకి వచ్చి సందడి చేశారు.
ఈ సంక్రాంతికి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాతో వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే వీరసింహారెడ్డి సినిమా యూనిట్ అన్‌స్టాపబుల్ షోకి వచ్చారు. డైరెక్టర్ గోపీచంద్ మలినేని, వరలక్ష్మి శరత్ కుమార్, హానీ రోజ్, రచయిత సాయి మాధవ్ బుర్రా, నిర్మాతలు నవీన్ యెర్నేని, రవి శంకర్ షోకి వచ్చి బాలయ్యతో కలిసి అలరించారు.
Veerasimha Reddy : టర్కీలో వీరసింహారెడ్డి యూనిట్ పై పోలీసులకి కంప్లైంట్స్ ఇచ్చిన స్థానికులు..
మైత్రి నిర్మాతలు ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతూ దూసుకుపోతున్నారు. ఇదే విషయాన్ని షోలో బాలకృష్ణ ప్రస్తావిస్తూ బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నారని విన్నాం అని అడగగా మైత్రి నిర్మాతలు నవీన్, రవిశంకర్ మాట్లాడుతూ.. ప్రభాస్ హీరోగా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఒక సినిమా ప్లాన్ చేశాం. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ తో కూడా ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాం అని అన్నారు. ఇప్పటికే ప్రభాస్, సిద్దార్థ్ ఆనంద్ సినిమా గురించి వినిపించినా దీనిపై అధికారిక కన్ఫర్మేషన్ ఇన్ని రోజులు లేదు. తాజాగా అన్‌స్టాపబుల్ షోలో మైత్రి నిర్మాతలు ఈ సినిమా గురించి క్లారిటీ ఇవ్వడంతో ప్రభాస్ మరో భారీ సినిమా చేయనున్నాడని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వార్, పఠాన్ లాంటి యాక్షన్ సినిమాలు తెరకెక్కించిన సిద్దార్థ్ ఆనంద్ ప్రభాస్ తో సినిమా అనగానే ఫుల్ యాక్షన్ మూవీతో వస్తాడేమో అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. తెలుగు నిర్మాతలు ఈ భారీ సినిమాని నిర్మించడం గమనార్హం.