Prabhas : ఢిల్లీ ఎర్రకోటలో రావణ దహనం.. ప్రభాస్ చేతుల మీదుగా.. రాష్ట్రపతి, ఢిల్లీ ముఖ్యమంత్రితో కలిసి..

దసరా సందర్భంగా ఢిల్లీ ఎర్రకోట గ్రౌండ్లో రాం లీలా వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో కలిసి ప్రభాస్ కూడా పాల్గొననున్నారు. ఆదిపురుష్ సినిమాలో శ్రీరామునిగా..........

Prabhas : ఢిల్లీ ఎర్రకోటలో రావణ దహనం.. ప్రభాస్ చేతుల మీదుగా.. రాష్ట్రపతి, ఢిల్లీ ముఖ్యమంత్రితో కలిసి..

Prabhas as guest for Delhi Ram Leela Event on Dasara

Updated On : October 4, 2022 / 7:17 PM IST

Prabhas :  దసరా సందర్భంగా ఢిల్లీ ఎర్రకోటలో రాం లీలా వేడుకలు, రావణ దహనం జరుగుతాయి. అయితే కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలు జరగకపోవడంతో ఈ సారి మరింత ఘనంగా ఈ రాం లీలా వేడుకలు నిర్వహించనున్నారు. అయితే ఈ సారి రావణ దహనం మన ప్రభాస్ చేతుల మీదుగా జరిపించనున్నారు.

దసరా సందర్భంగా ఢిల్లీ ఎర్రకోట గ్రౌండ్లో రాం లీలా వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో కలిసి ప్రభాస్ కూడా పాల్గొననున్నారు. ఆదిపురుష్ సినిమాలో శ్రీరామునిగా ప్రభాస్ నటిస్తున్న నేపథ్యంలో రావణ దహనానికి ముఖ్య అతిథిగా లవ్ కుష్ రాంలీలా కమిటీ ప్రభాస్ ని ఆహ్వానించారు.

Chiranjeevi : జనసేనకు భవిష్యత్తులో నా మద్దతు.. పవన్ రాజకీయాల్లో ఉంటే ప్రజలకి మేలు..

రేపు జరగబోయే రాం లీలా కార్యక్రమంలో రాఘవ్ తివారీ రాముడిగా నటిస్తుండగా, నటుడు అర్జున్ మండోలా లక్ష్మణుడిగా, నటి డెబ్లీనా ఛటర్జీ సీతగా, హనుమంతుడిగా మహాభారత్ నటుడు నిర్భయ్ వాధ్వా, రావణుడిగా అఖిలేంద్ర మిశ్రా కనిపించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రభాస్ హాజరవ్వడం, ప్రభాస్ చేతుల మీదుగా రావణ దహనం జరుగుతుండటంతో ఈ కార్యక్రమం కోసం ప్రభాస్ అభిమానులతో పాటు, తెలుగు వాళ్ళు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఆదిపురుష్ ఈవెంట్ కోసం సోమవారం అయోధ్యకి వెళ్లిన ప్రభాస్ ప్రస్తుతం అక్కడే ఉన్నాడు. నేడు రాత్రికి ఢిల్లీకి వెళ్లనున్నాడు. ఈ రావణ దహన కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ప్రభాస్ బీజేపీ పెద్దలని కలిసే అవకాశం ఉన్నట్టు సమాచారం.