Prabhas: పుట్టినరోజు వేడుకలపై ప్రభాస్ షాకింగ్ నిర్ణయం..?

ఇటీవల ప్రభాస్ ఇంట తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ పెద్దనాన్న, రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతిచెందడంతో ప్రభాస్ తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లాడు. అయితే ఇప్పుడిప్పుడే డిప్రెషన్ నుండి బయటకు వస్తున్న ప్రభాస్, అక్టోబర్ 23న పుట్టినరోజును జరుపుకోవద్దని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

Prabhas: పుట్టినరోజు వేడుకలపై ప్రభాస్ షాకింగ్ నిర్ణయం..?

Prabhas Decides To Be Away From Birthday Celebrations This Year

Updated On : October 22, 2022 / 6:54 PM IST

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలను రెడీ చేస్తూ అభిమానులను ఆసక్తిగా ఎదురుచూసేలా చేస్తున్నాడు. ఇప్పటికే ‘ఆదిపురుష్’ సినిమాను రిలీజ్‌కు రెడీ చేసిన ప్రభాస్, కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ అనే ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో ప్రభాస్ నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాదిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Prabhas: ప్రభాస్ బర్త్ డేకి ప్రాజెక్ట్-K నుంచి అప్డేట్.. నాగ్ అశ్విన్ ట్వీట్!

కాగా, ఇటీవల ప్రభాస్ ఇంట తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ పెద్దనాన్న, రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతిచెందడంతో ప్రభాస్ తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లాడు. అయితే ఇప్పుడిప్పుడే డిప్రెషన్ నుండి బయటకు వస్తున్న ప్రభాస్, అక్టోబర్ 23న పుట్టినరోజును జరుపుకోవద్దని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలను అంగరంగ వైభవంగా జరపాలని ప్రభాస్ ఫ్యాన్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ, ప్రభాస్ మాత్రం ఎలాంటి బర్త్‌డే వేడుకల్లో పాల్గొనవద్దని నిర్ణయం తీసుకున్నాడట.

Prabhas: ప్రభాస్, మారుతీల సినిమా టెస్ట్ షూట్ ప్రారంభం..

తన పెద్దనాన్నకు సంతాపం తెలిపే క్రమంలో ఈ విధంగా నిర్ణయం తీసుకున్నాడట యంగ్ రెబల్ స్టార్. మరోపక్క ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన బిల్లా చిత్రాన్ని 4K వెర్షెన్‌లో రీ-రిలీజ్ చేస్తోంది చిత్ర యూనిట్. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందా అని సినీ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి.