Eeswar Re-Release Trailer : ప్రభాస్ ‘ఈశ్వర్’ రీ రిలీజ్ ట్రైలర్ చూశారా..? రీ రిలీజ్ ఎప్పుడంటే..
తాజాగా ఈశ్వర్ సినిమా రీ రిలీజ్ ట్రైలర్ ని విడుదల చేసారు.

Prabhas Eeswar Movie Re-Release Trailer Released
Eeswar Re-Release Trailer : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతూ భారీ సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే పలు ప్రభాస్ సినిమాలు రీ రిలీజ్ అవ్వగా ఇప్పుడు ప్రభాస్ మొదటి సినిమా ఈశ్వర్ రీ రిలీజ్ కాబోతుంది. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈశ్వర్ సినిమాని అక్టోబర్ 23న గ్రాండ్‌గా రీ రిలీజ్ చేస్తున్నారు.
Also Read : Balayya – Boyapati : బాలయ్య – బోయపాటి నాలుగో సినిమా అప్డేట్.. ఆ రోజు మొదలు..
తాజాగా ఈశ్వర్ సినిమా రీ రిలీజ్ ట్రైలర్ ని విడుదల చేసారు. మూవీ ట్రైలర్‌ను అదిరిపోయేలా కట్ చేసారు. రీ ఇంట్రడ్యూసింగ్ ప్రభాస్ అంటూ ఆసక్తిగా ఇంట్రో ఇచ్చారు ప్రభాస్ కి. ప్రభాస్ చెప్పిన మాస్ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్, కామెడీ, రొమాంటిక్ సాంగ్స్, లవ్ సీన్స్.. ఇలా అన్ని చూపిస్తూ ట్రైలర్ కట్ చేసారు. మీరు కూడా ఈ ట్రైలర్ చూసేయండి..
అశోక్ నిర్మాణంలో జయంత్ సీ పరాన్జీ ఈశ్వర్ సినిమాని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇందులో శ్రీదేవి హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు ఈ సినిమాని లక్ష్మీ నరసింహా మూవీస్ రీ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు ప్రభాస్ బర్త్ డేని ఈశ్వర్ రీ రిలీజ్‌తో గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకునేందుకు డార్లింగ్ ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. వింటేజ్ ప్రభాస్ మేనియాను మరోసారి థియేటర్లో ఎంజాయ్ చేసేయండి.