Prabhas: కామెడీ రాజు కథ.. ఒకే చెప్పిన ప్రభాస్ రాజు.. దర్శకుడు ఎవరో తెలుసా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. వాటిలో (Prabhas)ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమా రాజాసాబ్. కామెడీ చిత్రాల దర్శకుడు మారుతీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
 
                            Prabhas going to do one more movie with director maruthi
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. వాటిలో ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమా రాజాసాబ్. కామెడీ చిత్రాల దర్శకుడు మారుతీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కామెడీ అండ్ హారర్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా(Prabhas) 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత కూడా ప్రభాస్ నుంచి వరుస సినిమాలు వస్తున్నాయి. వాటిలో.. ఫౌజీ, స్పిరిట్, సలార్ 2, కల్కి 2 లాంటి సినిమాలు ఉన్నాయి. ఓపక్క ఈ సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటూనే మరో క్రేజీ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ప్రభాస్.
Sandeep Reddy Vanga: అమ్మాయి వెంటపడ్డ సందీప్.. సైకిల్ మీద సర్కస్ ఫీట్లు.. అంతా చేస్తే చివరికి పాపం..
ఈ సినిమాను తెరకెక్కించబోయే దర్శకుడు మరెవరో కాదు మారుతీనే. అవును, ప్రస్తుతం రాజాసాబ్ సినిమా చేస్తున్న మారుతీ రీసెంట్ గా ప్రభాస్ కి ఒక పీరియాడికల్ కథను చెప్పాడట. మన చరిత్రలో మిగిలిపోయిన ఒక కామెడీ రాజు కథతో ఈ సినిమా రాబోతుందట. ఆ రాజు యొక్క క్యారెక్టర్ చాలా వింతగా ఉండటంతో వెంటనే ఒకే చెప్పేశాడట ప్రభాస్. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానుంది అని టాక్ నడుస్తోంది. అలా మరోసారి ప్రభాస్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు మారుతీ.
ఇక రాజాసాబ్ విషయానికి వస్తే, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రద్దీ కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ త్వరలోనే విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన రాజాసాబ్ ట్రైలర్ కి ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ రాగా సినిమా విడుదల కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో అనేది చూడాలి.






