Manchu Vishnu: ప్రభాస్ నాకు కృష్ణుడు లాంటి వాడు, ఇవాళ్టికి ఆయనను ఏడిపిస్తుంటాను- మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు
కర్ణుడు నువ్వు ఏమన్నా చెయ్యి నీ వెనకే ఉంటాను, నేను చూసుకుంటాలే ఏం జరిగినా అంటాడు.

Manchu Vishnu: కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మంచు విష్ణు మాట్లాడుతూ.. ప్రభాస్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ ను కృష్ణుడితో పోల్చారు మంచు విష్ణు. ప్రభాస్ నాకు కృష్ణుడు లాంటి వాడు అని ఆయన అన్నారు.
”స్నేహితుల్లో రెండు రకాలు. కృష్ణుడిలాగా, కర్ణుడిలాగా. కృష్ణుడు నీ పక్కనే ఉంటూ, నీకు దారి చూపిస్తూ, నీ వెంటే ఉంటాను అంటాడు. కర్ణుడు.. నువ్వు ఏమన్నా చెయ్యి, నీ వెనకే ఉంటాను, నేను చూసుకుంటాలే ఏం జరిగినా అంటాడు. నా జీవితంలో కృష్ణుడిగా ప్రభాస్. ఆయనకు ఈ సినిమా చేయాల్సిన అవసరమే లేదు. కానీ, నాన్న మీద ఉన్న ప్రేమ, అభిమానం, గౌరవంతో మాత్రమే ఒప్పుకున్నారు. ఇవాళ్టికి నేను ఆయనను ఏడిపిస్తుంటాను. మీరు నాన్న కోసం చేశారు నా కోసం చేయలేదని. తన గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ ఒక్కటే చెప్తా.
నేను ఆయనను విపరీతంగా ప్రేమించేది ఆయన మానవత్వాన్ని చూసి. నేటి తరం ఆయనను చూసి చాలా నేర్చుకోవాలి. కొంత డబ్బు వచ్చినా, కొంత పేరు వచ్చినా మనుషులు మారిపోతుంటారు. ప్రభాస్ ఇవాళ ప్రపంచంలోనే ఒక బిగ్గెస్ట్ స్టార్. కానీ మేమిద్దరం మొదటి రోజున ఎలా కలిశామో, ఈరోజుకి అలానే ఉన్నాం. ప్రభాస్ ఇది మీరు చూస్తున్నారు. నా జీవితంలో నాకు మీరు కృష్ణుడు, మీ జీవితంలో నేను మీకు కర్ణుడిని. మీకు ఏం కావాలో ఎప్పుడూ మీ వెనకాలే ఉంటాను, మీరు ఏమన్నా చెయ్యండి, నేను మీ కోసం ఉంటాను. మీ సాయానికి చాలా థ్యాంక్స్.
Also Read: ‘హరిహర వీరమల్లు’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఈసారి విలన్ తో కొత్త పోస్టర్..
ఇది విష్ణు సినిమా కాదు, ఇది కన్నప్ప సినిమా. ఎడిటింగ్ లో సినిమా చూసినప్పుడు ఇది ఇంత పెద్ద సినిమానా, మేము నటించామా, చేయగలిగానా అనిపించింది. శివయ్య దీవెనలు లేకుండా ఇది జరగడం అసాధ్యం. ఒక వేళ నేను కానీ డైరెక్ట్ చేస్తే మోహన్ లాల్ తో చేస్తాను. ఈ సినిమా అంత సులభంగా అవ్వలేదు. చెప్పుకోలేని బాధలు ఎన్నో అనుభవించాం.
మీ అందరూ సినిమా చూసి నన్ను ఆశీర్వదించండి. ప్రతి రోజు నాకు ఫోన్ చేసి ధైర్యం చెప్పే వాళ్లలో ముగ్గురు ఉన్నారు. వారే ప్రభుదేవా, బ్రహ్మానందం, ప్రభాస్. వారందరికీ నేను రుణపడి ఉన్నాను. మీ అందరి ఆశీస్సులతో కన్నప్ప సినిమా పెద్ద విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా” అని మంచు విష్ణు అన్నారు.
.@iVishnuManchu anna at #Kannappa pre release event prabhas anna gurinchi cheppadam ✨#KannappaMovie #Kannappaprereleaseeventpic.twitter.com/NbcrdXgluA
— Likhit MSDian™🦁 (@LIKHITRTF) June 21, 2025