Prabhas : ప్రభాస్ కి R లెటర్ కలిసి రావట్లేదా..? ఆ సినిమాలన్నీ అలా అయ్యేసరికి..

ఇటీవల సంక్రాంతికి ప్రభాస్ రాజాసాబ్ సినిమాతో వచ్చాడు.(Prabhas)

Prabhas : ప్రభాస్ కి R లెటర్ కలిసి రావట్లేదా..? ఆ సినిమాలన్నీ అలా అయ్యేసరికి..

Prabhas

Updated On : January 19, 2026 / 4:28 PM IST
  • ప్రభాస్ సినిమాలు
  • R లెటర్ కలిసి రావట్లేదంటున్న ఫ్యాన్స్, నెటిజన్లు
  • రాజాసాబ్ తో సహా ఆ సినిమాలన్నీ

Prabhas : ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్. ప్రభాస్ లైనప్ చాలా పెద్దదే. అన్ని భారీ సినిమాలే ఉన్నాయి. ప్రభాస్ సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తారు. ఇటీవల సంక్రాంతికి ప్రభాస్ రాజాసాబ్ సినిమాతో వచ్చాడు.(Prabhas)

రాజాసాబ్ సినిమా యావరేజ్ గా నిలిచింది. కాన్సెప్ట్ కొత్తది అయినా దాన్ని జనాల్లోకి సరిగ్గా తీసుకెళ్లలేకపోవడం, ప్రమోషన్స్ కరెక్ట్ గా ప్లాన్ చేయకపోవడం, ప్రీమియర్స్ సరిగ్గా పడకపోవడం, ఫస్ట్ హాఫ్ సరిగ్గా లేకపోవడంతో రాజాసాబ్ సినిమా ఫ్యాన్స్ ని, ప్రేక్షకులను నిరుత్సాహపరిచింది. ఈ సినిమా ఇప్పటివరకు దాదాపు 300 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు సమాచారం. అసలు ప్రభాస్ రేంజ్ కి, పండగ టైంలో రిలీజ్ కి ఈ కలెక్షన్స్ చాలా తక్కువ. దర్శక నిర్మాతలే సినిమా మెప్పించలేకపోయింది అని కామెంట్స్ చేయడం గమనార్హం.

Also See : Bandla Ganesh : చంద్రన్న కోసం బండ్లన్న పాదయాత్ర.. బండ్ల గణేష్ పాదయాత్ర ఫొటోలు..

అయితే రాజాసాబ్ సినిమా కూడా ఆశించినంత ఫలితం ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్, నెటిజన్లు R లెటర్ తో వచ్చే ప్రభాస్ సినిమాలు ఇలాగే అవుతున్నాయి. R లెటర్ ప్రభాస్ కి కలిసి రావట్లేదు. ఇంకోసారి R లెటర్ తో సినిమాలు తీయొద్దు అంటూ విశ్లేషిస్తూ కామెంట్స్, పోస్టులు చేస్తున్నారు. గతంలో ప్రభాస్ R లెటర్ తో రాఘవేంద్ర సినిమాతో 2003లో, రెబల్ సినిమాతో 2012లో, రాధేశ్యామ్ సినిమాతో 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు రాజాసాబ్ సినిమాతో 2026లో వచ్చాడు.

ఈ నాలుగు సినిమాలు కూడా ప్రేక్షకులను నిరాశపరిచాయి. రాఘవేంద్ర సినిమా అయితే ప్రభాస్ రెండో సినిమానే కానీ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. రెబల్ సినిమా భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్నా, సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ బాగున్నా ఫ్లాప్ టాక్ తెచ్చుకొని చివరకు యావరేజ్ గా నిలిచింది. ఇక కరోనా సమయంలో వచ్చిన రాధేశ్యామ్ సినిమా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని షూటింగ్ పూర్తిచేసి రిలీజ్ చేయాల్సి వచ్చింది. యాక్షన్ హీరో ప్రభాస్ ని సింపుల్ గా చూపించడంతో, ప్రేమకథలో సాగదీత చూపించడంతో ఆ సినిమాని ప్రేక్షకులు తిరస్కరించారు. ఈ మూడు సినిమాలు ప్రభాస్ కెరీర్లో ఆశించినంతగా ఆడలేదు.

Also Read : Paradise : ప్యారడైజ్ ఇంకా షూటింగ్ అవ్వలేదు.. చరణ్ తో పోటీకి రాదు.. నాని సినిమాపై అప్డేట్ ఇచ్చిన నిర్మాత..

ఇప్పుడు ఇదే లిస్ట్ లోకి రాజాసాబ్ కూడా చేరింది. కలెక్షన్స్ ఎంతో కొంత వచ్చినా హిట్ టాక్ తెచ్చుకోలేకపోయింది. దీంతో ప్రభాస్ కి R లెటర్ కలిసి రాదని, ఇకపై ప్రభాస్ సినిమాలకు R లెటర్ తో సినిమా టైటిల్స్ పెట్టొద్దని పలువురు ఫ్యాన్స్, నెటిజన్స్ అంటున్నారు. కానీ ప్రభాస్ ట్యాగ్ రెబెల్ స్టార్ అని R తో ఉండటం గమనార్హం.