Salaar : నవంబర్‌లో రాబోతున్న సలార్.. రిలీజ్ డేట్ వైరల్..!

ప్రభాస్ సలార్ నవంబర్ లో ఆడియన్స్ ముందుకు రాబోతుందట. ఒక ప్రముఖ ఆన్లైన్ టికెట్ బుకింగ్ వెబ్‌సైట్..

Salaar : నవంబర్‌లో రాబోతున్న సలార్.. రిలీజ్ డేట్ వైరల్..!

Prabhas Prashanth Neel Salaar release date is in november

Updated On : September 20, 2023 / 8:02 PM IST

Salaar : ప్రశాంత్ నీల్, ప్రభాస్ (Prabhas) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సలార్’. ఈ మూవీ పై పాన్ ఇండియా వైడ్ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల 28న ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఈ చిత్రం సడన్ గా పోస్ట్‌పోన్ అయ్యి అందరికి షాక్ ఇచ్చింది. ఇక ఈ మూవీ కొత్త విడుదల తేదీ కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా నవంబర్ లేదా డిసెంబర్ లో వచ్చే ఛాన్స్ ఉందంటూ కొన్ని రోజులు నుంచి వినిపిస్తున్న వార్త.

Vishal : రైతులకు కేజీఎఫ్ హీరో ‘యశ్’ చేసే సహాయం గురించి ఎవరికి తెలియదు..

తాజాగా ఒక ప్రముఖ ఆన్లైన్ టికెట్ బుకింగ్ వెబ్‌సైట్ సలార్ పలానా డేట్ లో రిలీజ్ కాబోతుంది అంటూ నోటిఫికేషన్ ఇచ్చింది. నవంబర్ 2న సలార్ రిలీజ్ కాబోతుంది అంటూ ఆ వెబ్‌సైట్ పేర్కొంది. ఇక ఆ విషయాన్ని ప్రభాస్ అభిమానులు స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే మూవీ టీం నుంచి మాత్రం.. విడుదల తేదీ పై ఎటువంటి క్లారిటీ రావడం లేదు. బాహుబలి సినిమా నుంచి ప్రభాస్ ప్రతి సినిమాకి ఇలానే అవుతుండడంతో అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Kannappa : మంచు విష్ణు ‘కన్నప్ప’ నుంచి హీరోయిన్ అవుట్.. రీజన్ ఏంటి..?

Prabhas Prashanth Neel Salaar release date is in november

Prabhas Prashanth Neel Salaar release date is in november

కాగా సలార్ VFX విషయం వలనే వాయిదా పడినట్లు తెలుస్తుంది. గ్రాఫిక్స్ కంపెనీ ఇచ్చిన అవుట్ ఫుట్ నచ్చలేదని, అక్కడి నుంచి బెటర్ అవుట్ ఫుట్ వచ్చిన తరువాతే.. ప్రశాంత్ నీల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నాడని ఫిలిం వర్గాల్లో వినిపిస్తున్న వార్త. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ‘సీజ్ ఫైర్’లో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) విలన్ గా కనిపించబోతున్నాడు. శ్రుతి హాసన్(Shruti Haasan) హీరోయిన్ గా న‌టిస్తుంటే శ్రియా రెడ్డి, సప్తగిరి, పృథ్వీ రాజ్, బ్రహ్మాజీ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.